Mercury Rising | బుధుడు నేడు కర్కాటకరాశిలో ఉదయించనున్నాడు. జులై 24న సాయంత్రం ఈ రాశిలోనే అస్తమించిన విషయం తెలిసిందే. బుధుడు విద్య, వ్యాపారం, తెలివితేటలు, తార్కికం, ఆర్థిక విషయాలు, స్టాక్ మార్కెట్, ఏకాగ్రతకు సంబంధించిన గ్రహం. నేడు (రక్షా బంధన్ రోజున) కర్కాటక రాశిలో బుధుడు ఉదయించడం వల్ల చాలా రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయం వారి తెలివితేటలు, ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఇది విద్య, వ్యాపారం, పెట్టుబడిలో విజయానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మూడు రాశులవారు బుధుని అనుగ్రహం నుంచి మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం..!
బుధుడు ఉదయించడం మేష రాశి వారికి అనేక రంగాల్లో శుభ ఫలితాలుంటాయి. ఈ రాశిలోని నాల్గవ ఇంట్లో బుధుడు ఉదయించబోతున్నాడు. ఇది ప్రాథమిక విద్య, ఇల్లు, కుటుంబానికి సంబంధించిన విషయాలలో ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని చుట్టుముట్టిన సమస్యలు, ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి. మీ కుటుంబంతో సమయం సంతోషంగా గడుపుతారు, విద్యార్థులు వారి చదువులపై దృష్టి పెడతారు. వారి ఏకాగ్రత పెరుగుతుంది. దీని కారణంగా వారు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే, రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
బుధుడు లగ్నానికి, నాల్గవ ఇంటికి అధిపతిగా రెండవ ఇంట్లో ఉదయించనున్నందున మిథునరాశి వారికి చాలా శుభాలుంటాయి. మీరు జీవితంలోని అనేక రంగాలలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. విద్యా రంగంలో, ముఖ్యంగా ఉన్నత విద్యలో అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. కుటుంబంలో పాత వివాదాలు ముగిసిపోతాయి. మీరు సౌకర్యవంతమైన జీవనశైలిని గడపగలుగుతారు. కొత్త బట్టలు, నగలు కొనాలని భావిస్తారు. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ వ్యూహాలు వ్యాపారంలో విజయవంతమవుతాయి. ఉద్యోగులు పదోన్నతి లేకపోతే పెద్ద బాధ్యత అందుకుంటారు.
బుధగ్రహం కన్య రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే లగ్నానికి, కర్మ అధిపతి, లాభ స్థానంలో బుధుడు ఉదయించబోతున్నాడు. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలను నయమవుతాయి. ఉద్యోగంలో జీతం పెరుగుదల, పదోన్నతి అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలోని తోబుట్టువులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. పిల్లల నుంచి మీకు శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులకు మార్గం తెరుచుకుంటుంది. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడంలో మీరు విజయం సాధిస్తారు.