శ్రావణ మాసం త్వరలో ప్రారంభం కానున్నది. ఆది దేవుడు పరమేశ్వరుడిని పూజించేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ ఏడాది శ్రావణ మాసం జులై 26న మొదలై ఆగస్టు 24 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో చాలా శుభయోగాలున్నాయి. గ్రహాల అరుదైన సయోగం జరుగనున్నది. ముఖ్యంగా దేవు గురువు బృహస్పతి, శనిదేవుడు ఇద్దరు ఒకే రాశిలో కలువనున్నారు. ఈ శుభయోగం వల్ల పలురాశుల వారి జీవితాలు మరింత మెరుగవనున్నాయి. బృహస్పతి జులై 9న మిథునరాశిలో తిరిగి ఉదయించనున్నాడు. అంటే బృహస్పతి తన శక్తితో కనిపించనున్నాడు. అదే సమయంలో శనైశ్చరుడు జులై 13న మిథునరాశిలోనే తిరోగమించనున్నాడు. ఈ సంయోగం కొన్ని రాశుల అదృష్టాన్ని మార్చే అవకాశం ఉంటుంది. శుభయోగంతో ఆర్థికంగా లాభాలు, జీవితంలో పురోగతి ఉండే ఛాన్స్ ఉంది.
బృహస్పతి ఉదయించడం, శనైశ్చరుడి తిరోగమణంతో వృషభ రాశి వారికి ఎంతో మేలు కలుగనున్నది. ఈ సమయంలో ఆర్థికంగా లాభాలుంటాయి. పెట్టుబడుల విషయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దేవుగురువు వృద్ధి స్థానంలో ఉండడం వల్ల, శనిగ్రహం ఆదాయం స్థానంలో తిరోగమణం వల్ల ఆదాయంతో అద్భుతమైన పెరుగుదల ఉంటుంది. వ్యాపారాలు చేస్తున్న పలువురు రాశివారికి ఈ యోగం లాభదాయకంగా ఉంటుంది.
శ్రావణమాసంలో గురువు ఉదయం, శనిగ్రహం తిరోగమనం వల్ల కర్కాటక రాశివారు అదృష్టంగా మారనున్నది. గువురు 12వ ఇంట ఉండడం, శని తిరోగమనం తొమ్మిదో స్థానంలో జరుగుతుంది. దాంతో శుభ ఫలితాలుంటాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ కాలంలో మీరు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి.
మిథున రాశి వారికి శని, బృహస్పతి సంచారం కారణంగా ఓ మార్పు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది. మీ జాతకంలో తొలి ఇంట్లోనే బృహస్పతి ఉదయించనున్నాడు. అయితే, ఖర్మస్థానమైన పదో ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. దీని కారణంగా మీ వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో, వివాహితుల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కూడా మీకు సమయం శుభప్రదంగా ఉంటుంది.