Kendra Trikona Raj Yogam | జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని న్యాయానికి అధిపతిగా భావిస్తారు. ఓ వ్యక్తి తాను చేసిన కర్మల ఆధారంగా ఆయన ఫలితాలను ఇస్తుంటాడు. ఇతర గ్రహాలతో పోలిస్తే శనిగ్రహం నెమ్మదిగా కదులుతుంది. అందుకు ఆయన ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఒక రాశిలో నుంచి వెళ్లి తిరిగి అదే రాశిలోకి వచ్చేందుకు ఆయనకు దాదాపు 30 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం, శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. జులై 13న అదేరాశిలో తిరోగమనం చెందుతాడు. శని తిరోగమన ప్రభావం ప్రతి వ్యక్తి జాతకంపై భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం మునుపటి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో శని మీనరాశిలో తిరోగమనం చెందే సమయంలో అరుదైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనున్నది. ఈ యోగ ప్రభావం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాజయోగం కారణంగా ఆకస్మిక ధనలాభం, అదృష్టం కలిసి వస్తుంది. గౌరవం, కెరీర్లో వృద్ధిని పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా శని శుభ గృహంలో ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ సమయం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు కొత్త అవకాశాలు వరిస్తాయి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, కేంద్ర భావాలు (మొదటి, నాల్గవ, ఏడవ, పదవ వంటివి), త్రికోణ భావాలు (మొదటి, ఐదవ, తొమ్మిదవ) అధిపతులు జాతకంలో కలిసిన సమయంలో శుభయోగంగా ఏర్పడుతాయి. అప్పుడే కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదం. యోగం ప్రభావం కారణంగా జీవితంలో సంపద, విజయం, ప్రతిష్ట, గౌరవాన్ని పొందుతాడు. అటువంటి యోగం ఏర్పడినప్పుడు, వ్యక్తి అదృష్టం మరింత పెరుగుతుంది. సమాజంలో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని చేరుకుంటారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతున్నది.
ఈ సమయం వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదమైనది. ఫలవంతమైందిగా పండితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం, శని తిరోగమనంలో ఉన్నాడు. వృశ్చిక రాశి ఐదవ ఇంట్లో ఉన్నాడు. మూడు, నాల్గవ ఇంటికి అధిపతి అయినందున కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఐదవ ఇల్లు విద్య, పిల్లలు, ప్రేమ సంబంధాలు, సృజనాత్మకతకు చిహ్నంగా పేర్కొంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ప్రయోజనాలు పొందుతారు. నిరంతర ప్రయత్నాలతో విజయాలను పొందుతారు. వివాహం గురించి ఆలోచన ఉంటే.. వివాహం జరిగే అవకాశం ఉన్నది. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో, ఏదైనా ప్రణాళికలో నిమగ్నమైన వృశ్చిక రాశి వ్యక్తులు చదువులు, పనిలో బిజీగా ఉంటారు. కానీ, కుటుంబం కోసం సమయం కేటాయించడం కూడా ముఖ్యం. దాంతో పాటు శని దృష్టి పదకొండవ ఇంటిపై (సామాజిక సంబంధం, లాభం ఇల్లు) ఉంది. దీని కారణంగా మీరు సామాజిక సంబంధాలు, భాగస్వామ్యాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూమి, భవనం వంటి ఆస్తికి సంబంధించిన ఏదైనా కల, కోరికలు నెరవేరుతాయి. భవన నిర్మాణం, వాహన కొనుగోలు, పెద్ద పెట్టుబడికి అవకాశం ఉంటుంది. తిరోగమనంతో చేసిన పనికి కర్మఫలం లభిస్తుంది. కాబట్టి సాధారణం కంటే కష్టపడి పనిచేయడం అవసరం. మీ కృషి మంచి ఫలితాలను ఇస్తుంది. దాన్ని సాధించడానికి దృఢ సంకల్పం, అంకితభావంతో పని చేయాలి.
ధనుస్సు రాశి వారికి నాల్గవ ఇంట్లో శని తిరోగమనంతో సానుకూల సంకేతాలుంటాయి. నాల్గవ ఇల్లు ఆనందం, ఆస్తి, ఇల్లు-కుటుంబం, వాహనానికి సంబంధించినది. ఇలాంటి పరిస్థితిలో శని కేంద్ర త్రికోణ యోగం కారణంగా మీరు ఈ అన్ని రంగాల్లో శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా నెరవేరని ఇల్లు, ఫ్లాట్, వాహనం కొనాలనే కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. శని దృష్టి కూడా ఆరవ ఇంటిపై పడుతోంది. దీని కారణంగా మీరు గృహ, వాహన, వ్యాపారం కోసం ఏదైనా రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే.. సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ కలహాలు ఇప్పుడు క్రమంగా దూరమవుతాయి. ఇంట్లో శాంతి, సామరస్యంతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు మంచి ప్రతిపాదనలు రావచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది. కృషి, లక్ష్యంపై దృష్టి పెట్టడం వల్ల సామర్థ్యం పెరుగుతుంది. ఇది కెరీర్, డబ్బు, ఇతర రంగాలలో పురోగతికి దారితీస్తుంది. ఆర్థికంగా, ఈ సమయం సంపద కూడబెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పాత అప్పును తీర్చే అవకాశాలున్నాయి. ఈ రాజయోగం కారణంగా మీకు స్థిరత్వం, పురోగతి, మానసిక సమతుల్యత ఉంటుంది.