Mars Transit In Leo | కుజుడు త్వరలో సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దాంతో 12 రాశులపై ప్రభావం పడనున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కుజుడు జూన్7న తెల్లవారు జామున 1.33 గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జులై 28 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. సింహరాశిలో సంచార సమయంలో కుజుడు రాహువు, కేతువు ప్రభావంలో ఉంటాడు. సింహరాశిలో కుజుడు ప్రవేశం వల్ల రాశులపై ఎలాంటి ప్రభావం పడబోతుంది.. పాటించాల్సిన నియమాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం..!
దేశంపై ప్రభావం
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. నాల్గో ఇంట కుజ సంచారం జరుగుతున్నది. దాంతో కేతువుతో సంయోగం ఏర్పడుతుంది. దాంతో అంతర్గత అస్థిరత, అసమ్మతి ఎదురవుతుంది. బయటి ప్రత్యర్థుల కంటే దేశంలోని అంతర్గత పరిస్థితులు సవాల్‌గా నిలుస్తాయి. పలు ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి. అలాగే, కొన్ని చోట్ల స్వల్ప భూకంపాలు వచ్చే ఛాన్స్ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మేషం
మేషరాశి ఐదో ఇంట కుజుడు సంచరించనున్నాడు. ఐదో ఇల్లు విద్య, పిల్లలు, ప్రేమకు సంబంధించింది. కేతువుతో పాటు కుజుడు సైతం ఉండడం వల్ల అశాంతిని కలిగిస్తుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను కాపాడుకునేందుకు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. గ్రహశాంతి, పరిహారం కోసం ప్రతిరోజూ వేప చెట్టు మొదట్లో నీరుపోయడం శుభపద్రం.
వృషభం
వృషభ రాశి నాల్గో ఇంట్లో కుజుడి సంచరించనున్నాడు. ఇది ఇల్లు, వాహనం, తల్లికి సంబంధించినది. ఈ గ్రహ సంచారంతో కుటుంబంలో ఉద్రిక్తతలు, భూమి, వాహనం, హృదయ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇంటి వాతావరణం మారిపోతుంది. అందరూ ఓపికతో ఉండడం మంచిది. పరిహారం కోసం మర్రి చెట్టుకు తియ్యటి పాలు సమర్పించడం శుభపద్రంగా ఉంటుంది.
మిథునం
ఈ రాశివారి మూడో ఇంట కుజుడి సంచారం జరుగుతుంది. ధైర్యం, తోబుట్టువులకు సంబంధించిన ఇల్లు. మీరు మీ శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటేనే కుజుడు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మెరుగైన పనితీరుతోనే ఉద్యోగంలో మంచి అవకాశాంటాయి. ప్రభుత్వ పనులకు సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోపానికి నియంత్రించుకోవాలి. సోదరులతో మంచి సంబంధాలను కొనసాగించడం మంచిది.
కర్కాటకం
ఈ రాశివారి రెండో ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. ఇది వాక్కు, సంపదకు నిలయం. కుజుడి ప్రభావంతో కుటుంబంలో విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. రెండో ఇంట్లో కుజుడు సంచరించడం వల్ల శత్రువు బాధలు, అగ్ని బాధలుంటాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో వివాదాలను నివారించడం ముఖ్యం. మంచి ఆరోగ్యం కోసం మెరుగైన ఆహారం తీసుకోవాలి. గ్రహశాంతి కోసం శివుడిని పాలు, నీటితో అభిషేకం చేయడం శ్రేయస్కరం.
సింహం
కుజుడు మీ రాశిలోనే సంచరించనున్నాడు. దాంతో మమ్మల్ని శక్తివంతం చేస్తుంది. కానీ, ఉత్సాహంతో ఉంటారు. అదే సమయంలో అహంకారం పెరిగే అవకాశం ఉంది. రాహువు, కేతువు ఇద్దరూ మొదటి ఇంట్లో ఉండడం వల్ల కుజుడి ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. తలనొప్పి, జ్వరం వచ్చే అవకాశంతో పాటు ప్రమాదం బారినపడే అవకాశాలుంటాయి. ఈ రాశివారు ఎవరి నుంచి ఉచితంగా ఏమీ తీసుకోకుండా ఉంటే మంచిది.
కన్య
కన్య రాశి పన్నెండో ఇంటిలో కుజుడు సంచరిసంచనున్నాడు. 12వ ఇల్లు ఖర్చులు, ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలను సూచిస్తుంది. గ్రహ ప్రభావంతో అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. నిద్రలేమితో బాధపడుతారు. దాంతో పాటు శని ఏడో ఇంట్లో ఉండడంతో కుజుడిపై దృష్టి పడుతుంది. ఈ పరిస్థితుల్లో వివాహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. గ్రహశాంతి కోసం హనుమాన్ఆలయాలన్ని దర్శించి ఏదైనా తీపిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి.. భక్తులకు పంచడం శుభపద్రం.
తుల
తుల రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం తదితర రంగాల్లోని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తుల రాశి ఏడో ఇంట్లో కుజుడి సంచారంతో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. గ్రహశాంతి కోసం శివుడిని తేనెతో అభిషేకించాలి.
వృశ్చికం
వృశ్చిక రాశి పదో ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. ఇది వృత్తి, సామాజిక ప్రతిష్టకు సూచిక. మీరు మీ కార్యాలయంలో ధైర్యం, నాయకత్వ నైపుణ్యాలతో బాగా రాణిస్తారు. కానీ, కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పరిహారం కోసం పిల్లలు లేని వారికి ఏదైనా సహాయం చేయడం శుభపద్రంగా ఉంటుంది.
ధనుస్సు
ఈ రాశి తొమ్మిదవ ఇంట్లో కుజ గ్రహ సంచారం జరుగుతుంది. అదృష్టం, దీర్ఘ ప్రయాణాలకు సంబంధించినది. ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను ఉంటాయి. అదృష్టం మీ వైపు ఉండకపోవచ్చు. కానీ, విద్య, పిల్లలకు సంబంధించిన విషయాలలో కొంత వరకు ఉపశమనం పొందుతారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన విషయాల్లో ఓ క్రమపద్ధతిలో పని చేయాల్సి వస్తుంది. ఎవరికీ ఇబ్బంది కలిగించే పనుల జోలికి వెళ్లకూడదు. పరిహారం కోసం పరమేశ్వరుడిని పాలతో అభిషేకం చేయించాలి.
మకరం
మకర రాశి ఎనిమిదో ఇంట్లో కుజ సంచారం జరుగబోతున్నది. మీరు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా రాహువు, కేతువు ప్రభావం కారణంగా కుజుడి తీవ్రత మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. జీర్ణ వ్యవస్థ, లైంగిక వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమైన పనుల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. గ్రహశాంతి కోసం పప్పులను ఆలయంలో దానం చేయండి.
కుంభం
కుంభ రాశి ఏడో ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. ఈ ఇల్లు వైవాహిక జీవితం, భాగస్వామ్యానికి సంబంధించింది. కుజుడి ప్రభావంతో వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు, భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఒప్పందాల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవడం మంచిది. గ్రహశాంతి కోసం ఆడపిల్లలకు స్వీట్లు పంచిపెట్టడం శ్రేయస్కరం.
మీనం
మీనరాశి ఆరవ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. శత్రువులు, వ్యాధులు, అప్పులకు సంబంధించిన ఇల్లు. ఈ సమయం సవాలుతో కూడుకున్నప్పటికీ మీకు అవకాశాలను వస్తాయి. కష్టపడి పనిచేస్తే.. పోరాడితే విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది. గ్రహశాంతి కోసం స్నేహితులకు ఉప్పు సంబంధిత వస్తువులు ఇవ్వడం శుభపద్రమని పండితులు పేర్కొంటున్నారు.
Read Also :
Venus Transit | మేషరాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల నాలుగురాశుల వారికి ఎంతో లాభమట..!
Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. జూన్ 01 నుంచి జూన్ 07 వరకు