Trigrahi Yogam | జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు, రాశులు, నక్షత్రరాశులకు కీలకమైన స్థానం ఉంది. ఎందుకంటే ప్రతి గ్రహానికి నిర్దిష్ట ప్రభావం ఉంటుంది. గ్రహాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు.. ఒకటి అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. ఈ యోగాలు ఓ వ్యక్తి జీవితంలో సానుకూలంగా లేదంటే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రహాల ప్రతేక కలయికను రాజయోగం లేదంటే త్రిగ్రహి యోగంగా పేర్కొంటారు. ఈ ఏడాది జూన్లో దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత దేవగురువు బృహస్పతి, సూర్యుడు, బుధుడు మిథునరాశిలో కలువనున్నారు. దాంతో త్రిగ్రహి యోగం ఏర్పడుతున్నది. ముఖ్యంగా దాంతో మూడురాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండనున్నది. జీవితాల్లో అనేక మార్పులు తేవడంతో పాటు కొత్త అవకాశాలను కల్పించనున్నది.
బృహస్పతి మే 14న వృషభ రాశిలో నుంచి మిథునరాశిలోకి ప్రవేశించాడు. బృహస్పతిని మనస్సు, అదృష్టానికి కారకుడిగా పేర్కొంటారు. దేవగువురు మానసిక స్థితి, జ్ఞానం, అదృష్టంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఆత్మ కారకుడైన సూర్యుడు జూన్ 15న మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆయన సంచారం కారణంగాఓ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. మీపై మీకు స్వీయ నియంత్రణ, మానసిక బలం పెరుగుతుంది. తెలివి, సంపదకు కారకుడైన బుధుడు వృషభ రాశి నుంచి జూన్ 6న మిథునరాశిలోకి వెళ్తాడు. ఆలోచనా సామర్థ్యం పెరగడంతో పాటు కమ్యూనికేషన్, వ్యాపార రంగంలో ప్రయోజనాలుంటాయి. మీ ప్రణాళికను మెరుగైన రీతిలో అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
ఈ సమయంలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి కలయిక మిథునరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ త్రిగ్రహి యోగంతో గౌరవ, ప్రతిష్ట పెరుగుతాయి. వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది. వైవాహిక సంబంధాలు మరింత బలపడుతాయి. వ్యాపారవేత్తలకు, ఈ సమయం పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జిస్తారు. అవివాహితులు వివాహ ప్రతిపాదనలను వస్తాయి. విద్యార్థులకు ఈ సమయం పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. మొత్తంమీద, సంతోషకరమైన సమయం. కుటుంబంలోని వివాదాలు సైతం పరిష్కారమవుతాయి.
సూర్యుడు, బుధుడు, బృహస్పతి కలయిక కారణంగా తుల రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం బాగుంటుంది. అనేక అవకాశాలను అందిస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక, శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కెరీర్లో కొత్త అవకాశాలు రావచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. పదోన్నతికి అవకాశాలున్నాయి.
సూర్యుడు, బుధుడు, బృహస్పతి కలయిక మీన రాశి వారికి అదృష్టం తెస్తుంది. భౌతిక సుఖాలను పొందుతారు. ఈ సమయంలో వాహనం, ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అకస్మాత్తుగా భారీ లాభాలు వచ్చిపడుతాయి. మీ హోదా, ప్రతిష్ట పెరగవచ్చు. ఈ సమయం రియల్ ఎస్టేట్, ఆస్తి, భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుంది.
Read Also :
Venus Transit | మేషరాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల నాలుగురాశుల వారికి ఎంతో లాభమట..!