Astrology Predictions | 2025 సంవత్సరంలోని మొదటి అర్ధభాగం ముగింపు దశకు చేరింది. మే నెల చివరి వారం తర్వాత జూన్నుంచి రెండో అర్ధభాగం మొదలుకానున్నది. అయితే, గ్రహాల సంచారం, స్థానచలనం కారణంగా వాతావరణ మార్పులతో పాటు యుద్ధం, విపత్తులు సంభవించే అవకాశం ఉందని జ్యోతిష పండితులు అంచనా వేస్తున్నారు. శనేశ్వరుడు, రాహు, కేతు, దేవగురు బృహస్పతి వంటి కీలక గ్రహాలు రాశులు మార్చుకున్నాయి. ఈ గ్రహాలు సామాజిక, రాజకీయ, వాతావరణ మార్పులకు కారణమయ్యే శక్తివంతమైనవి కావడంతో వీటి ప్రభావం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల మార్పునకు చాలా ప్రత్యేక ఉంటుంది. ఈ ఏడాది శనేశ్వరుడు, బృహస్పతి, రాహువు, కేతువులు రాశులు మార్చుకున్నాయి. ఈ గ్రహాల మార్పుల ఆధారంగా జ్యోతిషపండితులు దేశం, ప్రపంచం, వ్యక్తిగత జీవితంపై అంచనా వేస్తున్నారు. న్యాయానికి అధిపతి అయిన శనైశ్చరుడు తన రాశిని మార్చుకున్నాడు. శనైశ్చరుడు మార్చి 29న మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇదే రోజున ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం సంభవించిన విషయాన్ని జ్యోతిషపండితులు గుర్తు చేస్తున్నారు. ఈ గ్రహణం భారత్లో కనిపించకపోయినా.. యూరప్, ఉత్తర ఆసియా, అమెరికా తదితర ప్రాంతాల్లో కనిపించింది. విశేషం ఏంటంటే.. ఇదే రాశిలో ఆరు గ్రహాలు కలయిక జరిగింది. 2019లోనూ కరోనా వైరస్ప్రారంభంలోనే ఇలాంటి గ్రహయోగం ఏర్పడిందని పండితులు పేర్కొంటున్నారు.
శని, రాహు గ్రహాల సంయోగం అత్యంత శక్తివంతమైందిగా భావిస్తున్నారు. ప్రస్తుతం శనైశ్చరుడు మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడంతో.. దగ్గరగా ఉండడంతో భారీ సంఘటనలు జరిగే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు. నీటి మూలకమయిన మీనరాశిలో శనైశ్చరుడు ఉండడంతో వాతావరణ విపత్తులు, వరదలు, భూకంపాలు సంభించే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. శని మీనరాశిలోకి ప్రవేశించగా.. బృహస్పత వృషభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో బృహస్పతి స్థానం బలహీనపడడంతో వ్యాధులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బృహస్పతి మిధునరాశిలో ఉండగా.. అక్టోబర్19న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది సాధారణ స్థితి కాదని.. దేవగురు సాధారణంగా ఒక్కో రాశిలో సుమారు 12 నెలల పాటు ఉంటాడు. కానీ, ఈ సారి మాత్రం త్వరగానే రాశి మార్చుకుంటున్నాడు. దాంతో ‘అతిచార గతి’గా వ్యవహరిస్తున్నారు. ఇది అనుకూలంగా ఉండదని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు.
గురువు వేగంగా రాశి మారడం వల్ల భూమిపై అల్లకల్లోలానికి కారణమవుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో భూకంపాలు, వాతావరణ పరిస్థితుల్లో అనేక మార్పులు ఉండవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రోహిణి కార్తె నడుస్తుంది. వాస్తవానికి ఈ కార్తెలో ఎక్కువగా ఎండలు ఉంటాయి. ఈ కార్తెలో మధ్యలో వర్షాలు కురువడంతో గ్రహాల మార్పేనని పండితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ముందుగానే చేరుకోవడంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్లో బృహస్పతి అక్టోబర్లో మళ్లీ కర్కాటకంలో ప్రవేశించనున్న నేపథ్యంలో భవిష్యత్విషయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పులు, కొత్త వ్యాధుల ఉద్భమిస్తాయని.. రాజకీయ అస్థిరత కారణమవుతుందని.. అలాగే, ప్రపంచ స్థాయిలో మార్పులు ముంచుకొచ్చేందుకు అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.