Kaalsarpa Yogam | రాహువు, కేతువుల సచారంతో కాలసర్ప యోగం ఏర్పడింది. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలోకి ప్రవేశించారు. అన్నిగ్రహాలు వాటి అక్షం వైపునకు రాగా.. ఈ సమయంలో కాలసర్ప యోగం జాతకంలో ఏర్పడింది. జ్యోతిషశాస్త్రంలో దీన్ని అశుభంగా భావిస్తారు. ఈ యోగం మే 18న మొదలు కాగా.. జులై 28 వరకు ప్రభావం ఉండనున్నది. ఆ తర్వాత కుజుడు కన్యరాశిలోకి ప్రవేశించినప్పుడు దాని ప్రభావం తగ్గడం మొదలవుతుంది. ఈ యోగం కారణంగా మానసిక ఒత్తిడి, అడ్డంకులు, జీవితంలో అస్థిరత ఉంటుంది.
ఈ సమయంలో ముఖ్యంగా నాలుగురాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశులవారు మానసిక ఆందోళన, ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. పనిలో అడ్డంకులు, నిర్ణయంలో తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఈ సమయంలో గ్రహశాంతి కోసం పలు మంత్రాలను జపించడం, ప్రశాంతంగా ఉండడం వల్ల ఉపశనమం ఉంటుంది. అయితే, ఈ యోగం కారణంగా ప్రభావితమయ్యే ఆ నాలుగు రాశులు ఏంటో ఓసారి తెలుసుకుందాం..!
మేషరాశి వారికే సాడేసాత్ మొదలుకానున్నది. కేతువు ఐదో ఇంట్లో సంచరిస్తుండడంతో కొత్త ఆలోచనాలు వస్తాయి. కానీ, వ్యతిరేకత, సంఘర్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రమాదకర పనుల జోలికి వెళ్లకపోవడం మంచిది. విద్య, ఉద్యోగం కారణంగా ఇంటికి దూరమయ్యే సూచనలున్నాయి. కడుపు సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది.
సింహరాశిలో కేతువు సంచారం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ రాశివారిపై రాహువు దృష్టి సైతం పడుతుంది. దాంతో పాటు కుజుడు మీనరాశిలో సంచరించస్తాడు. దాంతో ఉద్యోగం, వ్యాపారాల్లో ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది. విద్యుత్, పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. లేకపోతే గాయపడే ప్రమాదం ఉంది.
కుంభ రాశి వారికి సాడేసాత్ చివరి దశ ప్రారంభమవుతుంది. రాహు సంచారం కారణంగా మానసిక ఒత్తిడి.. అస్థిరతకు గురవుతారు. గురువు కారణంగా కొంత ఉపశమనం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. ప్రేమ జీవితంలో విభేదాలు ఏర్పడే సూచనలున్నాయి. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను నివారించుకోవాలి. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీన రాశి వారికి ఏలినాటి శని రెండోదశ ప్రారంభమవుతుంది. రాహు, కేతు సంచారంతో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. పన్నెండవ, ఆరవ ఇంట ఈ గ్రహాల సంచారంతో ఆకస్మిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఖర్చులు పెడుతారు. పాత వ్యాధులు తిరగబెట్టే ప్రమాదం ఉంది. వాహనాలు నడుపుతున్న సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.
Venus Transit | మేషరాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల నాలుగురాశుల వారికి ఎంతో లాభమట..!