Budhaditya Raja Yogam | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో పలు గ్రహాలతో కలిసి పలు యోగాలను ఏర్పరుస్తాయి. అలాంటి యోగాల్లో ఒకటి బుధాదిత్య రాజయోగం. ఇది చాలా శుభప్రదమైన యోగం. ఈ రాజయోగాన్ని కలిగి ఉన్న రాశిచక్రాలకు సంపద, శ్రేయస్సు, ఆనందాన్ని తీసువస్తుంది. బుధాదిత్య రాజయోగం గౌరవం, ప్రతిష్టను పెంచుతుంది. బుధాదిత్య రాజయోగం బుధుడు, సూర్యుడి సంయోగం కారణంగా ఏర్పడుతుంది. బుధుడు, సూర్యుడు ఒకే రాశిలో ఉన్న సమయంలో ఈ యోగం ఏర్పడుతుంది. తెలివితేటలు, వాక్కుకు కారకుడు బుధుడు. ప్రస్తుతం బుధుడు తులారాశిలో ఉన్నాడు. అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ రాజ్యయోగం ఏర్పడడం వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం..!
కర్కాటక రాశి వారికి బుధాదిత్య రాజయోగం అనేక అవకాశాలను తీసుకురానున్నది. బుధాదిత్య రాజయోగం కారణంగా కర్కాటక రాశి రియల్ ఎస్టేట్లో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ జాతకంలో బుధాదిత్య రాజ్యయోగం జాతకంలోని నాల్గవ ఇంట్లో అంటే.. వాహనాలు, ఆస్తి ఇంట్లో ఈ యోగం ఏర్పడనున్నది. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీరు వాహనం కొనుగోలు చేయవచ్చు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం ఉంది. దీనితో పాటు, విదేశాలలో వ్యాపారం చేసే వారు మంచి లాభాలను పొందవచ్చు. ఈ సమయంలో, ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశం ఉంది. లాభ అవకాశాలు పెరగవచ్చు.
బుధాదిత్య రాజ్యయోగం తులా రాశి వారికి ప్రయోజనకరంగా ఉండనున్నది. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. ఈ రాజయోగం జాతకంలోని మొదటి ఇంట్లో ఏర్పడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఉద్యోగులకు మంచి అవకాశాలు రావొచ్చు. భౌతిక సుఖాలు పెరిగే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
బుధాదిత్య రాజ్యయోగం మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా, అనుకూలంగా ఉంటుంది. ఈ యోగం మీ జాతకంలో పదవ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది వృత్తి, వ్యాపారానికి ఇల్లు. ఇది ఉద్యోగ వృద్ధికి దారితీస్తుంది. ఈ సమయంలో మీరు పనిలో కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. మీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది. ప్రేమలో పడుతారు. ఈ యోగం ఆర్థిక లాభానికి సంబంధించిన అవకాశాలను పెంచుతుంది.
Read Also :
Gajkesari Raja Yogam | ధనత్రయోదశికి ముందు గజకేసరి యోగం.. ఈ రాశులవారిదే అదృష్టమంటే..!
Venus Transit | కన్యారాశిలోకి శుక్రుడు.. ఈ రాశులవారి తలరాతనే మార్చబోతున్నాడుగా..!
Mercury Transit | తులారాశిలోకి బుధుడు.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!