చదువు, ఉద్యోగరీత్యా మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా కుటుంబాలకు దూరంగా, వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారిపై కుటుంబ పెద్దల పర్యవేక్షణ కొరవడటం వల్ల కొంత మంది దురలవాట్లకు లోనవుతుంటారు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, హోటల్ భోజనం, జంక్ ఫుడ్ వంటి వాటికి దగ్గరవుతారు. బయటి ఆహారంలో ఎక్కువగా హానికరమైన రసాయన రంగులు, వాడిన నూనెలనే మళ్లీ మళ్లీ వాడటం తదితరాలు క్యాన్సర్ కారకాలుగా మారుతాయి. వీటికితోడు వృత్తిపరమైన కొన్ని అంశాలు కూడా క్యాన్సర్లకు దారితీస్తాయి. అందులో ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గురవడం, నిద్రలేమి, నైట్ డ్యూటీలు, ఏసీ గదుల్లో అధిక సమయం గడపడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటివి పురుషులలో క్యాన్సర్ వ్యాధులు రావడానికి కారణమవుతున్నట్లు చెప్పవచ్చు.
పురుషుల్లోనే ఎక్కువ:
మహిళలతో పోలిస్తే పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు మినహా ఇతర అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు పురుషుల్లోనే ఎక్కువగా చూస్తాం. ఈ మధ్య కాలంలో పురుషుల్లో కూడా రొమ్ము క్యాన్సర్ కనిపిస్తుండటం కలవరపెడుతున్నది. వ్యాధులపై అవగాహన పెరుగుతున్నా, క్యాన్సర్లను ముందుగానే తెలుసుకునే స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చినా క్యాన్సర్ రోగాలకు అడ్డుకట్ట వేయలేక, రోగుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం 2030నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య ఇతర క్యాన్సర్ల కంటే అధికంగా ఉండవచ్చని అంచనా.
ఇవే ప్రధాన కారకాలు:
పురుషుల్లో క్యాన్సర్ వ్యాధులు రావడానికి ప్రధాన కారకాలు సిగరెట్, బీడీ, పాన్ మసాలా, గుట్కా, ఆల్కహాల్, పొగాకు నమలడం మొదలైనవి. వీటివల్ల ఎక్కువగా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్ రోగుల్లో మనదేశమే మొదటి స్థానంలో ఉండటం దురదృష్టకరం. ప్రతి సంవత్సరం 80వేల మంది వరకు నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న కోల్కతాలో ప్రతి లక్ష మందిలో 20మంది ఊపిరితిత్తుల క్యాన్సర్కు, వాయు కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో 15 మంది చొప్పున బలవుతున్నారు.
పురుషులను వేధిస్తున్న క్యాన్సర్లు:
వీరికి రిస్క్ ఎక్కువ:
దురలవాట్లు ఉన్నవారితోపాటు ఆస్బెస్టాస్ కంపెనీలలో పనిచేసేవారు, అల్యూమినియం ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీల్లో పనిచేసేవారు, ఆల్కహాల్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీలు, రేడియం ఉత్పత్తులు, రేడియో న్యూక్లయిడ్స్, చెక్కపొడి, గామా రేడియేషన్ అధికంగా ఉన్న ప్రదేశాల్లో పనిచేసేవారికి ఊపిరి తిత్తులు, తల, మెడ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అధికంగా ఎండలో తిరిగేవారు, ఎండ అస్సలు తగల కుండా ఏసీ గదులకే పరిమితమయ్యేవారు, అధికంగా నైట్ డ్యూటీలు చేసేవారు, పెస్టిసైడ్స్, కెమికల్స్ కంపెనీల్లో ఎక్కువగా పురుషులే పనిచేస్తుండటం వల్ల వారికే క్యాన్సర్ ముప్పు ఎక్కువ అని చెప్పాలి.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే అంతే….
గొంతునొప్పి, ఘన పదార్థాలు తీసుకోలేకపోవడం
ఆకలి, బరువుతగ్గడం v మూత్రం ఆగి ఆగి రావడం, మూత్రంలో రక్తం కనిపించడం
తగ్గకుండా దీర్ఘకాలం వేధించే దగ్గు, దగ్గుతో పాటు రక్తం పడటం
మల విసర్జనలో రక్తస్రావం v అజీర్తి
నోటిలో ఏర్పడిన పుండ్లు మానకుండా ఉండటం
ఎముకల నొప్పులు నిర్ధారణ పరీక్షలు:
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98480 11421