Zinc deficiency : శరీరంలో పలు కీలక విధులను నిర్వర్తించడంలో అత్యవసర పోషకం జింక్ అత్యంత అవసరం. జింక్ పలు మొక్కలు, జంతు సంబంధిత ఆహారాల్లో సహజంగా లభిస్తుంది. జింక్ సరైన రీతిలో శరీరానికి అందితే రోగనిరోధక వ్యవస్ధ బలోపేతం కావడంతో పాటు గాయాలు సత్వరమే మానతాయి.
చర్మ ఆరోగ్యం మెరుగవడం, ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు కణాల వృద్ధిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. పాల ఉత్పత్తులు, గుడ్లు, తృణధాన్యాలు, చేపలు, నట్స్, మాంసం, పప్పుధాన్యాలు, కొన్ని కూరగాయల్లో జింక్ సమృద్ధిగా లభిస్తుంది.
జింక్ రోజువారీ అవసరాలకు తగినంతగా తీసుకోకుంటే ఆరోగ్యంపై పెనుప్రభావం చూపుతుంది. జింక్ లోపంతో తలెత్తే లక్షణాలను, లోపాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ జింక్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.
రోజూ జింక్ ఎంత పరిమాణంలో తీసుకోవాలి..!
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పురుషులు రోజుకు 11ఎంజీ, మహిళలు 8ఎంజీ చొప్పున రోజుకు జింక్‌ను తీసుకోవాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు 11ఎంజీ, 12ఎంజీ తీసుకోవాలి.
జింక్ లోపిస్తే తలెత్తే లక్షణాలు
జుట్టు ఊడిపోవడం
గాయాలు త్వరగా మానకపోవడం
లైంగికాసక్తి సన్నగిల్లడం
నిస్సత్తువ
డయేరియా
కంటిచూపు సమస్యలు
Read More :
Pension Hike | ఏపీలో పింఛన్ల పెంపు.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం