Fruits With Pulp | ప్రస్తుతం చాలా మంది అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. ఉరుకుల పరుగుల బిజీ యుగంలో భోజనం చేసేందుకు కూడా సరిగ్గా టైమ్ ఉండడం లేదని చాలా మంది విచారిస్తున్నారు. అలాగే చాలా మంది ఆలస్యంగా తినడమో, అతిగా తినడమో చేస్తున్నారు. దీనికి తోడు వ్యాయామం కూడా ఉండడం లేదు. ఫలితంగా అధికంగా బరువు పెరిగిపోతున్నారు. శరీరంలో కొవ్వు అధికంగా చేరి ఇబ్బందులు పడుతున్నారు. అయితే శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీంతో ఎల్డీఎల్ స్థాయిలు ఎక్కువవుతాయి. ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. దీన్ని తగ్గించేందుకు మనం హెచ్‌డీఎల్‌ను పెంచే ఆహారాలను తినాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల హెచ్‌డీఎల్ స్థాయిలను పెంచుకోవచ్చు.
సాధారణంగా చాలా మంది పలు రకాల పండ్లకు చెందిన పొట్టును తీసి తింటారు. కానీ పొట్టులోనే ఎన్నో పోషకాలు ఉంటాయి. కనుక పండ్లను తినేటప్పుడు పొట్టు తీయకుండా తినాలి. ముఖ్యంగా యాపిల్ పండ్లను తినే వారు పొట్టు అసలు తీయవద్దని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే యాపిల్ పండు తొక్కలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్లు ఎ, సి, కె అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. కనుక యాపిల్ పండ్లను పొట్టు తీయకుండానే తినాలి. యాపిల్ పండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును పెంచుతుంది. ఈ పండ్లలోని విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం అవకుండా రక్షించుకోవచ్చు.
ఇక పియర్స్ పండ్లను కూడా పొట్టు తీయకుండానే తినాల్సి ఉంటుంది. ఈ పండ్లకు చెందిన పొట్టులో మన శరీరానికి కావల్సిన అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక పియర్స్ పండ్లను పొట్టు తీయకుండానే తినాల్సి ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
కివి పండ్లను చాలా మంది పొట్టు తీసే తింటారు. కానీ ఈ పొట్టులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. కనుక కివి పండ్లను కూడా పొట్టుతో సహా తినాల్సి ఉంటుంది. కివి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కచ్చితంగా ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఉదయం పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ అయినా చేయాలి. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. అయితే కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కచ్చితంగా పైన చెప్పిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. గుండె పోటు రాకుండా నివారించవచ్చు.