Sesame Seeds | అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే డైట్‌ను పాటిస్తుంటారు. అలాగే వ్యాయామం కూడా చేస్తుంటారు. అయితే పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది. అలాంటి ఆహారాల్లో నువ్వులు కూడా ఒకటని చెప్పవచ్చు. నువ్వులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. నువ్వుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల నువ్వులను తింటే ఎముకలు బలంగా మారుతాయి. దీంతోపాటు బరువు కూడా తగ్గవచ్చు. అయితే నువ్వులను రోజూ నేరుగా తినలేమని అనుకునేవారు నువ్వులతో పలు ఆహారాలను తయారు చేసి తినవచ్చు. బరువు తగ్గేందుకు నువ్వులను ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వులతో సహజంగానే చాలా మంది లడ్డూలను తయారు చేస్తుంటారు. అయితే ఈ లడ్డూల్లో చక్కెర లేదా బెల్లం ఉంటుంది. కానీ ఈ రెండింటికి బదులుగా విత్తనాలను తీసిన ఖర్జూరాలను తీపి కోసం ఉపయోగించవచ్చు. నువ్వులను కాస్త వేయించి వాటికి ఖర్జూరాల పేస్ట్‌ను కలిపి లడ్డూలలా తయారు చేసి రోజుకు ఒక లడ్డూను తినవచ్చు. ఇవి రుచిగా ఉండడమే కాదు, బరువును తగ్గిస్తాయి. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
మీరు రోజూ స్మూతీలను కనుక తాగుతుంటే ఆ స్మూతీల్లో నువ్వులను కలిపి తీసుకోవచ్చు. దీంతో బరువు తగ్గాలనుకునే మీ ప్రణాళిక కచ్చితంగా అమలవుతుంది. నువ్వులను ఇలా స్మూతీలలో కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. దీంతో పొట్ట దగ్గరి కొవ్వును కూడా సులభంగా కరిగించుకోవచ్చు. నువ్వుల స్మూతీలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువ సేపు ఉన్నా సరే ఆకలి అవకుండా చూస్తాయి. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
మీరు రోజూ సలాడ్స్‌ను గనుక తింటుంటే సలాడ్స్‌పై కాసిన్ని నువ్వులను చల్లి తీసుకోవచ్చు. దీంతో సలాడ్ మరింత ఆరోగ్యవంతం అవుతుంది. దీంతోపాటు క్రంచీ టేస్ట్ కూడా వస్తుంది. ఇలా సలాడ్‌ను తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు. అలాగే మీరు ఇంట్లోనే గ్రనోలా బార్‌ను తయారు చేసి తినవచ్చు. కొన్ని ఓట్స్, నట్స్, గుప్పెడు నువ్వలను తీసుకుని వాటికి తేనె కలిపి గ్రనోలా బార్‌ను బేక్ చేయండి. దీన్ని మీరు మీల్స్ మధ్యలో స్నాక్స్ లా తీసుకోవచ్చు. దీంతో బరువు తగ్గుతారు. ఇవే కాకుండా మీరు రోజూ తినే పలు ఇతర ఆహారాల్లోనూ నువ్వులను ఏదో ఒక విధంగా కలిపి తింటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. దీంతోపాటు నువ్వుల్లో ఉండే పోషకాలు కూడా మనకు లభిస్తాయి.