మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం మొత్తం హెల్తీగా ఉంటుంది. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు ఇలా ఇంటిల్లిపాదిని ఆరోగ్యంగా ఉంచేందుకు మహిళలు శ్రద్ధ చూపుతారు. అదే విధంగా సొంత ఆరోగ్యంపై కూడా అంతే శ్రద్ధ చూపాలి. దానికోసం ముందుగా తినే ఆహారంపై దృష్టిపెట్టాలి. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే ఆహారాన్ని ఎక్కువగాతీసుకోవాలి. శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏ ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఐరన్
శరీరానికి ఐరన్ ఎంతో ముఖ్యం. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. రోజువారి ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, విత్తనాలు, పండ్లు తీసుకోవాలి.
విటమిన్ బి12
మెదడు చురుగ్గా పని చేయడానికి, మానసిక ప్రశాంతతకు విటమిన్ బి12 అవసరం. మాంసం, చీజ్, పాలు, గుడ్లు, బాదంపప్పు, పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలి. స్త్రీలలో ఎక్కువగా వచ్చే మూడ్ స్వింగ్స్ సమస్యకు విటమిన్ బి12 చక్కని పరిష్కారం.
బయోటిన్
మెరిసే చర్మం, జుట్టు, జీర్ణక్రియ మెరుగుదలకు బయోటిన్ అవసరం. గుండె, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అరటిపండ్లు, బ్రకోలీ, బాదంపప్పు, తృణధాన్యాలు, ఆలుగడ్డలు, గుడ్ల నుంచి శరీరానికి బయోటిన్ అందుతుంది.
కాల్షియం
బచ్చలికూర, పాలు, చియా గింజలు, సోయాబీన్స్‌లో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలు బలంగా, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. స్త్రీలకు ఎముకలు దృఢంగా ఉండటం చాలా ముఖ్యం.
విటమిన్ డి
మాంసం, చేపలు, గుడ్లు, నారింజను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. విటమిన్ డి మెదడు, కండరాల పనితీరు మెరుగుపడటానికి దోహదపడుతుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దంతాలను పటిష్ఠం చేస్తుంది.