Weight Loss | బరువు తగ్గాలనుకుంటున్నారా..? రోజు ఈ చిట్కాలు పాటించండి..!
weight loss | ఊబకాయం(ఒబెసిటీ).. ఈ జనరేషన్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. చాలామంది కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చొని పనిచేయడంతో

ఊబకాయం(ఒబెసిటీ).. ఈ జనరేషన్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. చాలామంది కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చొని పనిచేయడంతో సమస్య వేధిస్తోంది. పొట్ట చుట్టూ అనవసర కొవ్వు పేరుకుపోవడం వల్ల.. అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో ఒబెసిటీ సమస్య వస్తోంది.. పలు సందర్భాల్లో భావోద్వేగ స్థాయిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊబకాయం పెరగడంతో శరీరం వికారంగా కనిపిస్తుంది. ఈ ఊబకాయంతో అనేక వ్యాధులకు కూడా కారణం అవుతాయి.
అధిక బరువు పెరగడంతో అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు తగ్గడం కోసం ఎన్నో వ్యాయామాలు, డైట్ల గురించి చెప్పినా ఒక్కోసారి పని వల్ల, మరికొన్ని సార్లు బద్ధకంతో ఎందరో బరువు తగ్గించుకోలేకపోతున్నారు. ప్రతి రాత్రి కొన్ని చిట్కాలు పాటించడం, ఆహారంలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా సులభంగా బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

పుష్కలంగా నీరు తాగాలి
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. బరువును నియంత్రించడంలో నీరు ప్రభావవంతంగా ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి.. నీరు ఎక్కువగా తాగాలి. తద్వారా కడుపు నిండిన అనుభూతిని కలిగించడంతో పాటు అనవసరమైన కేలరీలను తీసుకోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. నీరు ఎక్కువగా తాగడంతో శరీరంలోని టాక్సిన్స్ కూడా బయటకు వెళ్లిపోతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.

పడుకునే ముందు తేలికపాటి వ్యాయామం చేయాలి
మీరు మీ పెరుగుతున్న బరువును నియంత్రించాలనుకుంటే.. క్రమం తప్పకుండా పడుకునే ముందు.. పది నుంచి పదిహేను నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చేయాలి. బరువు తగ్గడానికి ఇది చాలా ప్రభావవంతమైన మార్గం.

తగినంత నిద్ర అవసరం
ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం అని అందరూ అంటుంటారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో దినచర్య అస్తవ్యస్తంగా మారింది. ఒక అధ్యయనం ప్రకారం.. తగినంత నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణమని తేలింది. ఒక వ్యక్తికి కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర అవసరం.

అర్ధరాత్రి తినొద్దు..
బరువు అదుపులో ఉండాలంటే రాత్రిపూట ఆలస్యంగా తినడం మానేయాలి. ఎక్కువ తినడం వల్ల జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. తద్వారా రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతాయి. దీంతో పాటు, మీ శరీరంలోని కొవ్వు కూడా అనవసరంగా పెరుగుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

