Snoring | ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కంటి నిండా నిద్రపోవడమే గగనంగా మారింది. కొందరు ఏదో నిద్ర పోయాం అన్నట్లుగా ఉంటే.. మరికొందరు కంటి నిండా నిద్ర పోతుంటారు. అయితే, ఇదే సమయంలో ఎవరైనా నిద్రలో గురక పెడితే.. వామ్మో ఆ నరకానికి మించింది మరోటి ఉండదు అనిపిస్తుంది. ఎవరిలోనైనా నిద్ర పోయే సమయంలో గురక రావడం సర్వసాధారణమైపోయింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలింతకీ గురక ఎందుకు వస్తుంది..? గురక రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం.
ఎందుకు వస్తుంది..?
నిద్రపోతున్నప్పడు ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడిన సమయంలో గురక వస్తుంది. గురక వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉండటం వల్ల మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడి గురకకు దారితీస్తుంది. మద్యం సేవించడం, సిగరెట్ స్మోకింగ్, ట్రాంక్విలైజర్ ఔషధాల వాడకంతో కూడా గురక వస్తుంది. ఇది ఒక కారణం మాత్రమే. వాస్తవంగా మరెన్నో అంశాలు ఉన్నాయి. ప్రధాన కారణంగా మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పరిశోధకులు నిర్ధారించారు.
చెక్ పెట్టండిలా..