న్యూఢిల్లీ : ఒంటరితనం శారీరక, మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపే దీర్ఘకాల విపరిణామాలకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO ) హెచ్చరించింది. ఒంటరితనం కుంగుబాటు, ఆందోళన, హృద్రోగం, స్ట్రోక్, డిమెన్షియా, అకాల మరణం వంటి ముప్పులకు కారణమవుతుంది. ఒంటరితనం సామాజికంగా, అనుబంధాల పరంగా మనిషిని ఏకాకిని చేస్తుందని, ఇది అంతర్జాతీయ ఆరోగ్య ముప్పుకారకంగా మారుతున్నదని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
ఒంటరితనం, దాని దుష్పలితాలను నివారించేందుకు జాతీయ వ్యూహాలను రూపొందించి అమలు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ ఆయా దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఒంటరితనం, ఏకాకి జీవితం అంటువ్యాధి పేరుతో ప్రచురించిన నివేదికలో డబ్ల్యూహెచ్ఓ ఒంటరితనం వ్యక్తులు, సామాజిక ఆరోగ్యానికి విసిరే సవాళ్లను ప్రస్తావించింది.
ఒంటరితనంతో హృద్రోగ ముప్పు, డిమెన్షియా, స్ట్రోక్, కుంగుబాటు, అలజడి, అకాల మరణం వంటి పెను ముప్పులు పొంచి ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఒంటరితనం రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానమైన ప్రాణాంతకమని పేర్కొంది. ఊబకాయం, శారీరక చురుకుదనం కొరవడటం కంటే ఒంటరితనం ప్రమాదకరమని స్పష్టం చేసింది. నలుగరితో కలవలేకపోవడంతో వ్యక్తుల సామర్ధ్యం, ఉత్పాదకత క్షీణిస్తుందని ఈ నివేదికలో డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
Read More :