న్యూఢిల్లీ : ఆరోగ్యకర జీవితాన్ని ఆస్వాదించాలంటే వ్యాయామం, (workout session) ఆహారం, నిద్ర వంటి మూడు అంశాలు ప్రధానమైనవి. వీటి మధ్య సరైన సమతూకం పాటిస్తూ ఉంటే హార్మోన్ల సమతుల్యత మెరుగై వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉంది. వ్యాయామం, నిద్ర లాగానే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తుంది. ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించడంలో ఆహారమే శరీరానికి ఇంధనంగా ముందుకొస్తుందని ఫిట్నెస్ ఎక్స్పర్ట్, మై బాలీవుడ్ బాడీ ఫౌండర్ సన్నీ చెబుతున్నారు.
మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు, కండలు తీరిన దేహం కోసం వర్కవుట్స్‌కు ముందు, తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనే వివరాలను సన్నీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. వర్క్‌వుట్ చేసే ముందు పప్పు ధాన్యాలు, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి శక్తిని మెల్లిగా విడుదల చేసే ఆహారం తీసుకోవాలని సన్నీ చెప్పుకొచ్చారు. కండరాలను రిపేర్ చేసి కండరాల పెరుగుదలకు దోహదపడే ప్రొటీన్‌ను సరిపడినంత తీసుకోవాలి.
ఎగ్స్‌తో హోల్ గ్రెయిన్ టోస్ట్, నట్స్‌తో ఓట్ మీల్, చీజ్ శాండ్విచ్ వంటివి వర్కవుట్స్‌కు ముందు తీసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. ఇక వ్యాయామం అనంతరం కండరాలు కోలుకునేందుకు ప్రొటీన్‌తో కూడిన ఆహారం అవసరం. స్వీట్ పొటాటోలతో గ్రిల్డ్ చికెన్, వేరు శెనగలతో క్వినోవా సలాడ్, ప్రొటీన్ పౌడర్‌తో చేసిన స్మూతీ, పండ్లు, యోగర్ట్ వంటివి తీసుకోవాలి. వర్కవుట్ అనంతరం శరీరం కోల్పొయిన ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేసేందుకు తగినంత నీరు లేదా స్పోర్ట్స్ డ్రింక్ తీసుకోవాలని సన్నీ సూచించారు.