Beetroot Juice | బీట్ రూట్ మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటుంది. బీట్రూట్ను కొందరు వేపుడు చేస్తారు. కొందరు కూరగా చేసుకుని తింటే కొందరు సలాడ్ రూపంలో తింటారు. బీట్రూట్ను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బీట్ రూట్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. బీట్రూట్ను నేరుగా తినడం ఇష్టం లేకపోతే దాన్ని జ్యూస్‌గా చేసుకుని రోజూ తాగవచ్చు. రోజూ కనీసం 100 ఎంఎల్ మోతాదులో బీట్రూట్ జ్యూస్‌ను తాగితే చాలు, అనేక లాభాలు కలుగుతాయి. బీట్ రూట్ జ్యూస్‌ను సాధారణంగా ఉదయం సేవిస్తే మంచిది. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. శరీరానికి పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధుల నుంచి బయట పడతారు.
బీట్ రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరానికి నైట్రేట్స్ లభించి మన శరీరంలో అవి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. రక్త నాళాలను ప్రశాంతంగా మారుస్తాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. బీట్ రూట్ జ్యూస్‌ను తాగితే అందులో ఉండే నైట్రేట్స్ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి మన శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో కణాలకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవుతుంది. ఫలితంగా శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. శారీరక శ్రమ చేసేవారికి, వ్యాయామం చేసే వారికి బీట్ రూట్ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల శరీరానికి మళ్లీ చురుకుదనం వస్తుంది. మళ్లీ ఎలాంటి అలసట లేకుండా పని చేయగలుగుతారు.
బీట్ రూట్లో బీటాలెయిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి బయట పడేస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. బీట్ రూట్ చాలా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువను కలిగి ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ జ్యూస్‌ను తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది. బీట్ రూట్లో అధికంగా ఉండే బీటాలెయిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. వాపులకు గురికాకుండా చూస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నుంచి బయట పడవచ్చు.
బీట్ రూట్లో ఉండే బీటాలెయిన్ అనే సమ్మేళనం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే సేవించాలి. వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ చేసేవారు తమ పనులకు ఒక గంట ముందు ఈ జ్యూస్‌ను తాగితే మేలు జరుగుతుంది. బీపీ ఉన్నవారు ఈ జ్యూస్‌ను రోజుకు 200 ఎంఎల్ వరకు తాగవచ్చు. కానీ బీట్ రూట్ జ్యూస్‌ను అధికంగా సేవిస్తే విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి వారు ఈ జ్యూస్‌కు దూరంగా ఉండాలి. బీపీ ఉన్నవారు ఉదయం ఈ జ్యూస్‌ను సేవించాలి. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇలా బీట్ రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.