చర్మానికి.. ఇదేం ఖర్మ?
చలికాలం చర్మం పగలడానికి బయటి వాతావరణం ఒక కారణమైతే, చలి కారణంగా తగినన్ని మంచినీళ్లు తీసుకోకపోవడం మరో కారణం. కాలంతో సంబంధం లేకుండా.. రోజూ తప్పకుండా రెండు లీటర్ల నీళ్లు తాగాల్సిందే. ముఖ్యంగా శరీరంలోంచి చెమట బయటికి పోకపోవడం వల్ల కూడా చర్మం రంగు తగ్గినట్టు కనిపిస్తుంది.
చలికాలంలో చర్మం పగులుతుంది. నల్లగా మారుతుంది. దీని నుంచి చర్మాన్ని సంరక్షించుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
– ఓ పాఠకురాలు
చలికాలం చర్మం పగలడానికి బయటి వాతావరణం ఒక కారణమైతే, చలి కారణంగా తగినన్ని మంచినీళ్లు తీసుకోకపోవడం మరో కారణం. కాలంతో సంబంధం లేకుండా.. రోజూ తప్పకుండా రెండు లీటర్ల నీళ్లు తాగాల్సిందే. ముఖ్యంగా శరీరంలోంచి చెమట బయటికి పోకపోవడం వల్ల కూడా చర్మం రంగు తగ్గినట్టు కనిపిస్తుంది. చర్మ సంరక్షణలో విటమిన్-ఇ కీలకపాత్ర పోషిస్తుంది. బాదం గింజల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. నానబెట్టి కానీ, నేరుగా కానీ రోజుకు పది గింజలు తింటే చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. చర్మం కాంతిమంతంగా కనిపించడానికి విటమిన్-డి కూడా తోడ్పడుతుంది. అందుకే, విటమిన్-డి ఫోర్టిఫైడ్ పాలు తాగాలి. అందులోని ప్రొటీన్ కూడా చర్మానికి మేలు చేస్తుంది. దాల్చిన చెక్కకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అపారం. పగిలిన చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి, దాల్చిన చెక్క ముక్కను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని తాగవచ్చు. మజ్జిగలో ఆ పొడి వేసుకునీ తాగొచ్చు.
గెనుసుగడ్డలోని బీటాకెరోటిన్ చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది, యవ్వనంగానూ ఉంచుతుంది. నారింజలో లభించే విటమిన్-సి చర్మంలోని కొలాజెన్‌ను పెంచి, సాగే గుణాన్ని పటిష్ఠం చేస్తుంది. సాల్మన్ చేప, వాల్నట్స్, గుమ్మడి, అవిసె గింజల్లో ఉండే ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా చర్మానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా అవిసె గింజలు నానబెట్టి తిన్నా, పొడి రూపంలో తీసుకున్నా చర్మానికి మెరుపు ఖాయం. ఆకుకూరల్లో విటమిన్-ఎతో పాటు ఇ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. కూర గాయల్లో క్యారెట్, బీట్రూట్ ఈ కోవ లోనివే. ద్రాక్షలాంటి పండ్లతో పాటు.. సపోట, స్ట్రాబెర్రీ, మల్బెర్రీ మంచి యాంటీ ఆక్సిడెంట్లు. చర్మానికి నిత్య యవ్వనాన్ని ఇవ్వడంతో పాటు.. తేమగా ఉంచేందుకు సాయపడతాయి. కాబట్టి చర్మ సమస్యల్ని నిర్లక్ష్యం చేయొద్దు.
-మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్, Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

