Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా, శనివారం జరిగిన ఎపిసోడ్లో ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఆమెను బయటకు పంపిస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా, శనివారం జరిగిన ఎపిసోడ్లో ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఆమెను బయటకు పంపిస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఆదివారం ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఉండటంతో హౌస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం ఎపిసోడ్లో కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించిన నాగార్జున వారికి స్టార్స్ ఇచ్చారు. ఆశించిన స్థాయిలో ఆడలేదని భావించిన సుధీర్, ఝాన్సీ, ఆర్కే, నీతూలను జీరో స్టార్స్ విభాగంలో ఉంచారు. ఆర్కేను ఉద్దేశించి నాగార్జున మాట్లాడుతూ.. ‘నవరస మామ అంటారు.. కానీ నీలో శోక రసం మాత్రమే కనిపిస్తోంది’ అంటూ సెటైర్ వేశారు. మరోవైపు నరేశ్, రామ్ ప్రసాద్‌ల ఆటతీరును అభినందిస్తూ వారికి ఐదు స్టార్స్ ఇచ్చారు.
వర్షిణికి మొదట మూడు స్టార్స్ ఇచ్చిన నాగార్జున, ఆ తర్వాత ఆమెను జీరో స్టార్స్ విభాగానికి మార్చారు. దీనికి కారణం శివకుమార్ గురించి వర్షిణి, ముకేశ్, సుధీర్, రోహిత్ కలిసి రహస్యంగా మాట్లాడుకున్న సంఘటన. ఈ నలుగురి సంభాషణకు సంబంధించిన వీడియోను నాగార్జున హౌస్‌మేట్స్‌కు చూపించారు. ఆ వీడియోలో శివకుమార్ గురించి రోహిత్, ముకేశ్ చేసిన వ్యాఖ్యలతో పాటు, కొన్ని పదాలను సుధీర్, వర్షిణి పరోక్షంగా ప్రస్తావించిన తీరు కనిపించింది. ఆ పదాల అర్థం ఏమిటని నాగార్జున ప్రశ్నించగా, వారు సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. మీరే చెప్పడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ మాటలు విన్న ప్రేక్షకులు ఎలా భావిస్తారో ఆలోచించారా? అంటూ నాగార్జున వారిని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వర్షిణికి ఇచ్చిన మూడు స్టార్స్‌ను జీరోకు తగ్గించారు.
ఇదే ఎపిసోడ్లో త్రిగుణ్‌కు సంబంధించిన మరో వీడియోను నాగార్జున చూపించారు. ఇతర కంటెస్టెంట్లు తన గురించి రహస్యంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునే అవకాశాన్ని ఆయనకు కల్పించారు. ఈ వీడియోలో వర్షిణి మాట్లాడుతూ.. త్రిగుణ్ బలహీనతపై దెబ్బ కొడతానని, తాను కొడితే అతను తట్టుకోలేడని వ్యాఖ్యానించినట్లు కనిపించింది. దీనిపై త్రిగుణ్ స్పందిస్తూ.. సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయంపై మాట్లాడతానని నాగార్జునకు తెలిపారు. మరోవైపు త్రిగుణ్ ఆటతీరును నాగార్జున అభినందించి, అతడికి ప్రత్యేక బహుమతి అందించారు.
చివర్లో జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. త్రిగుణ్ కుండలను పగలగొట్టగా, అందులో ఝాన్సీ ఫొటో కనిపించలేదు. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అయితే అంతకుముందు ముకేశ్ తన మ్యాజిక్ పవర్‌ను ఉపయోగించి సుధీర్‌ను సేవ్ చేశాడని, ఆ అవకాశం లేకపోతే ఝాన్సీ స్థానంలో సుధీర్ ఎలిమినేట్ అయ్యేవాడని నాగార్జున వెల్లడించారు. తన నిర్ణయం వల్ల ఝాన్సీ హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందనే బాధతో ముకేశ్ వెక్కివెక్కి ఏడ్చాడు. ఝాన్సీ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో తన అమాయకత్వంతో ఇక కొనసాగలేనని, అయితే తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేనని ఆమె భావోద్వేగానికి గురైంది. తన నిజాయతీ, వ్యక్తిత్వం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ హౌస్‌మేట్స్‌కు వీడ్కోలు పలికింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

