Aakasamlo Oka Tara | ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్..!
Aakasamlo Oka Tara | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో చేరువయ్యారు. ఆయన నటించే సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఓ తార’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
Aakasamlo Oka Tara | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో చేరువయ్యారు. ఆయన నటించే సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఓ తార’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 20న ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా.. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచుతోంది.
ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి ..కల్పన అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. చిన్న గ్రామంలో జీవించే కల్పనకు వ్యోమగామి కావాలనే పెద్ద కల ఉంటుంది. తన పరిస్థితులు, ఎదురయ్యే అడ్డంకులు ఎన్ని ఉన్నా ఆ లక్ష్యాన్ని సాధించాలని ఆమె పట్టుదలగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రయాణంలో కృష్ణ అనే పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ ఆమెకు అండగా నిలుస్తాడు. కల్పన కలను నిజం చేయడానికి కృష్ణ ఎలా తోడ్పడ్డాడు? ఆమె ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించేందుకు ఎలా సహాయం చేశాడు? అనే అంశాల చుట్టూ ఈ కథ సాగనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల ద్వారా సినిమా కథలోని ప్రధాన అంశాలు ప్రేక్షకులకు కొంతవరకు పరిచయమయ్యాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ మాత్రం కథలోని భావోద్వేగాలను మరింత బలంగా చూపించింది. ముఖ్యంగా ఓ సాధారణ గ్రామీణ అమ్మాయి అంతరిక్షంలోకి వెళ్లాలనే అసాధారణమైన కలను సాకారం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటున్నాయి. ఆమెకు అండగా నిలిచే కృష్ణ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. హృదయాన్ని తాకే సంభాషణలు, మనసుకు హత్తుకునే నేపథ్య సంగీతం కథకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కల్పన కల, ఆమె ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు, కృష్ణ ఇచ్చే ధైర్యం.. ఇలా ప్రతి అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించారు. ట్రైలర్ చూస్తుంటే వెండితెరపై ఈ కథను చూడాలనే ఆసక్తి కలుగుతోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లితో పాటు శ్రుతి హాసన్, స్వాసిక, మురళీ శర్మ, రుహానీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటీనటుల ప్రదర్శనలు కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉండటంతో పాటు, కథకు తగ్గట్టుగా విజువల్స్‌ను రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ‘ఆకాశంలో ఓ తార’ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా, వైజయంతీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నవంబర్ 20న తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్..!
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

