SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
SCENE Trailer | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘సీన్’. మలయాళ సెన్సేషన్స్ నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
SCENE Trailer | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘సీన్’. మలయాళ సెన్సేషన్స్ నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తెరకెక్కించిన జీతూ మాధవన్ ఈ చిత్రాన్ని పూర్తి డార్క్ కామెడీ, యాక్షన్ మరియు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో సూర్య పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరినీ లెక్కచేయని తిరుగులేని లెజెండ్ కాప్ ‘ఇన్బరాజ్’ పాత్రలో కనిపించనున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సడన్‌గా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. రాజీనామా తర్వాత ఏం చేస్తావంటే.. రాజకీయాల్లోకి వెళ్తానంటూ సూర్య చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. కథలో భాగంగా ఓ ప్రమాదకరమైన, అత్యంత క్రూరమైన సైకో కిల్లర్ ‘ఈశ్వర్’ (నస్లెన్) ఆట కట్టించడానికి మాజీ పోలీస్ అయిన ఇన్బరాజ్ మళ్లీ రంగంలోకి దిగాల్సి వస్తుంది. సూర్యకు సమానమైన తెలివితేటలతో నస్లెన్ నడిపించే మైండ్ గేమ్స్, ఇద్దరి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ చేజ్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక చిత్రంలో ‘మాయ’ అనే పాత్రలో నటిస్తున్న నజ్రియా గ్లామర్‌తో పాటు కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల్లోనూ కనిపించి అలరించారు. విలన్ బెదిరిస్తుంటే.. “అలెక్సా.. ఏదో ఒక మంచి మూడ్ మ్యూజిక్ ప్లే చెయ్” అంటూ సూర్య చెప్పే డైలాగ్ మరియు చివరిలో వచ్చే మాస్ విజువల్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.
ఈ దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మలయాళ సంగీత సంచలనం సుషిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. జగరం స్టూడియోస్ మరియు 2డి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

