Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
SanjayGupta | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా అకస్మిక మరణం బాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన ఇంట్లోని బాత్రూమ్లో రాత్రి సమయంలో జారిపడి తీవ్ర తల గాయం కావడంతో ఆయన కన్నుమూశారు.
Director Sanjay Gupta | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా అకస్మిక మరణం బాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన ఇంట్లోని బాత్రూమ్లో రాత్రి సమయంలో జారిపడి తీవ్ర తల గాయం కావడంతో ఆయన కన్నుమూశారు. ఈ విషాద వార్త తెలుసుకున్న ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి పనిచేసిన ‘కాబిల్’ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ హృతిక్ ఎమోషనల్ అయ్యారు. తమది కేవలం ఒక్క సినిమాతోనే ముగిసిపోవాల్సిన ప్రయాణం కాదని, ఇంకా ఎన్నో చేయాల్సి ఉండేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ గుప్తాలో ఉన్న సినిమాపై మంట, ప్రతి కొత్త ఆలోచనకు పొంగిపోయే ఆ బాలుడిలాంటి ఉత్సాహం, ఆయన నవ్వు ఎప్పటికీ గుర్తుంటాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తన జీవితంలోనే ‘కాబిల్’ ద్వారా అత్యుత్తమ అనుభూతిని అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. అంతులేని ప్రేమతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని హృతిక్ కోరుకున్నారు.
సంజయ్ గుప్తా మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. దర్శకుడు అశోక్ పండిట్ స్పందిస్తూ.. ఆయన మరణం అత్యంత షాకింగ్‌గా ఉందని, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంజయ్ గుప్తా అంత్యక్రియలు రాత్రి సమయంలో జరగగా.. అభిషేక్ బచ్చన్, రాకేష్ రోషన్, రోహిత్ రాయ్, రోనిత్ రాయ్, ఫరా ఖాన్ తదితరులు హాజరై నివాళులర్పించారు. వెర్సోవా పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 1967లో ముంబైలో జన్మించిన సంజయ్ గుప్తా.. 26 ఏళ్ల వయసులోనే ‘ఆతిష్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ‘కాంటే’, ‘జిందా’, ‘షూటౌట్ ఎట్ వాలాడ’ వంటి క్రైమ్ డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హృతిక్ రోషన్‌తో ఆయన తెరకెక్కించిన ‘కాబిల్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 208 కోట్లు రాబట్టి ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

