Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Symbols were tampered | ఏపీలో(AP) మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో (Municipal elections ) గుర్తులు(Symbols tampered) తారుమారయ్యాయి.
Symbols were tampered | ఏపీలో(AP) మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో (Municipal elections ) గుర్తులు(Symbols tampered) తారుమారయ్యాయి. ఈ సంఘటన విజయవాడలో(Vijayawada) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరపాలక సంస్థ 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు పక్కన హస్తం గుర్తు ముద్రించగా.. కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రించారు. బ్యాలెట్ పేపరలో గుర్తులు మారడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు డివిజన్లో పోలింగ్ నిలిపి వేశారు. కొత్తగా బ్యాలెట్ పేపర్స్ ప్రింట్ చేసిన తర్వాత పోలింగ్ జరగనున్నట్లు సమాచారం.
అయితే పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తూ ఆర్వో గతంలో విడుదల చేసిన ఫారం-11లో మాత్రం సక్రమంగానే గుర్తులు ఉన్నాయి. అధికారులు ఉద్దేశపూర్వకంగా గుర్తులు మార్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి.. ఆర్వోకు ఫిర్యాదు చేశారు. గుర్తుల తారుమారుతో ఓటర్లు అయోమయంలో పడ్డారు. మరోవైపు వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

