Fiber | మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు గాను అనేక రకాల పోషక పదార్థాలు సహాయం చేస్తాయి. వాటిల్ల ఫైబర్ కూడా ఒకటి. దీన్నే పీచు పదార్థం అని కూడా పిలుస్తారు. ఫైబర్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాల్యుబుల్ ఫైబర్ కాగా రెండోది ఇన్ సాల్యుబుల్ ఫైబర్. ఇవి రెండూ మనకు పలు ఆహారాల్లో లభిస్తాయి. సాల్యుబుల్ ఫైబర్ నీటిలో కరుగుతుంది. ఇది పండ్లు, బీన్స్, చిరు ధాన్యాలు, గింజలు, కూరగాయల్లో అధికంగా ఉంటుంది. అలాగే ఇన్ సాల్యుబుల్ ఫైబర్ అంత త్వరగా నీటిలో కరగదు. కాస్త సమయం పడుతుంది. ఈ రకం ఫైబర్ మనకు ఎక్కువగా పండ్లు, గింజలు, కూరగాయలు, తృణ ధాన్యాల ద్వారా లభిస్తుంది. అయితే ఈ రెండు రకాల ఫైబర్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్ ఉండే ఆహారాలను రోజూ తింటుండం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
ఫైబర్ వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఫైబర్ ఉండే ఆహారాలను తింటుంటే అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం, పొట్టలో అసౌకర్యం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణలో ఉంటాయి. ఇలా ఫైబర్ మనకు ఎంతో మేలు చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు రోజూ ఫైబర్ ఉండే ఆహారాలను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఫైబర్ వల్ల జీర్ణాశయం నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కనుక ఫైబర్ ఉన్న ఆహారాలను తింటుండం వల్ల సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.
ఫైబర్ ఉన్న ఆహారాలను రోజూ తింటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. మధుమేహం ఉన్నవారు రోజూ ఫైబర్ ఉండే ఆహారాలను తింటుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఫైబర్ వల్ల మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి ఉండదు. అలాగే గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాలను తింటుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
సాధారణంగా ఫైబర్ నీటిలో కరుగుతుంది. కనుక ఇది మన శరీరంలో నిల్వ ఉండదు. కనుక ఫైబర్ ఉండే ఆహారాలను రోజూ కచ్చితంగా తినాల్సి ఉంటుంది. ఇక ఫైబర్ పురుషులకు అయితే రోజుకు 30 గ్రాములు, స్త్రీలకు 25 గ్రాముల వరకు అవసరం అవుతుంది. 2 నుంచి 5 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు 15 గ్రాములు, 5 నుంచి 11 ఏళ్లు ఉన్నవారికి 20 గ్రాముల వరకు రోజూ ఫైబర్ కావాలి. ఫైబర్ ఎక్కువగా మనకు ఓట్స్, బార్లీ, యాపిల్ పండ్లు, సిట్రస్ జాతికి చెందిన నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్ పండ్లు, అరటి, పియర్స్, బెర్రీ పండ్లు, క్యారెట్లు, మొలకలు, చియా విత్తనాలు, అవిసె గింజలు, బ్రౌన్ రైస్, కినోవా, మొక్కజొన్న, బాదంపప్పు, వాల్ నట్స్, గుమ్మడి విత్తనాలు, కాలిఫ్లవర్, క్యాబేజీ, పచ్చి బఠానీ, కొత్తిమీర, పాలకూర, పుదీనా, తోటకూర, జామ పండ్లు, నల్ల శనగలు వంటి అనేక ఆహారాల్లో లభిస్తుంది. కనుక వీటిని రోజూ తింటుంటే ఫైబర్‌ను పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.