మహిళల్లో ఈ సమస్యలుంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువ
Female Infertility | సంతానలేమి అనేది ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్య. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.

Female Infertility | సంతానలేమి అనేది ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్య. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. వారి ఆరోగ్య పరిస్థితులతో పాటు చాలా సమస్యలు సంతాన లేమికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఊబకాయం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్, పీసీవో, యుటెరైన్ ఫిబ్రాయిడ్స్, ఎండోపమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్న వారిలో పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ఆ సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదని డాక్టర్ దీక్షా భాస్కర్ చెబుతున్నారు. అవేంటంటే..

- ఏఎంహెచ్ తక్కువగా ఉంటే దాన్ని మెరుగుపరచుకోవాలి. ఇందుకోసం విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే ఏఎంహెచ్ స్థాయిని పెంచుకోవచ్చు.
- ఊబకాయంతో బాధపడుతుంటే.. బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజూ వ్యాయామం చేయడంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.
- ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత, పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్లు, ఇతర హార్మోన్ల, గర్భాశయ సమస్యలను తగ్గుతాయి.
- హెల్తీ లైఫ్‌స్టైల్ అలవరచుకొని, కంటినిండా నిద్రపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనలను నియంత్రించుకోవచ్చు.
- ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.. దీనివల్ల అండాల ఉత్పత్తి నాణ్యత మెరుగుపరచుకోవచ్చు.
ఒకవేళ మీరు 35 ఏండ్లలోపు వారైతే 6 నెలలపాటు పోషకాహారం తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేయడం, అలాగే సరైన నిద్రపోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడి.. సంతానాన్ని పొందవచ్చని డాక్టర్ దీక్ష చెబుతున్నారు.
Note: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యులు లేదా ఆహార నిపుణులను సంప్రదించండి. ఈ సమాచారానికి నమస్తే తెలంగాణ ఎలాంటి బాధ్యత వహించదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
Health Tips | పిల్లలు పుట్టాలంటే స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి? శుక్రకణాలు పెరగాలంటే ఇవి తినండి
ఈ ఐదింటిని డైట్లో చేర్చుకుంటే రక్తహీనత మాయం..!
షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

