lose weight | బరువు తగ్గాలంటే.. వీటిని తీసుకోవాలి..!
చాలా మంది బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజంగా బరువును మెయింటైన్ చేస్తే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. మన శరీరం క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేయాలంటే.. శరీర మెటబాలిజం పెరగాలి..
చాలా మంది బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజంగా బరువును మెయింటైన్ చేస్తే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. మన శరీరం క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేయాలంటే.. శరీర మెటబాలిజం పెరగాలన్న సంగతి తెలిసిందే. దీంతో మనం తినే ఆహారం త్వరగా జీర్ణమై ఆ తరువాత వచ్చే శక్తి క్యాలరీల రూపంలో త్వరగా ఖర్చవుతుంది. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అయితే మెటబాలిజం పెరగాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవాలి. దీంతో అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
* ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఎందుకంటే ప్రోటీన్లను జీర్ణం చేయడం కోసం శరీరం ఎక్కువగా క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అలాగే ప్రోటీన్ల వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
* నిత్యం 2 లేదా 3 కప్పుల కాఫీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాఫీ తాగడం వల్ల శరీర మెబటాలిజం పెరిగి క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక బరువు కూడా తగ్గుతారు.
* ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా మెటబాలిజంను పెంచుకోవచ్చు.
* యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గించడంలోనే కాక మెటబాలిజం పెరిగేందుకు కూడా సహాయ పడుతుంది. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకుని తాగితే మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చయి బరువు తగ్గుతారు.
* గోరు వెచ్చని నీటిని నిత్యం తాగడం వల్ల కూడా శరీర మెటబాలిజం పెరుగుతుంది. రోజూ సాధారణ నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని తాగితే నెలకు 1 నుంచి 2 కిలోల వరకు బరువు తగ్గవచ్చు.
* పాలకూర మొదలైన ఆకుకూరలు తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.
* సాల్మన్ కూడా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూసుకుంటుంది. ఇందులో ప్రోటీన్స్, ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఐయోడిన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది.
* గుడ్లు బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని గుడ్లు తగ్గిస్తాయి.
* కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయలలో ఫైబర్ సమృద్ధిగా ఉండి శరీరం బరువు పెరగకుండా చేస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

