వాస్తవం: విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) పనితీరుకు అండగా నిలుస్తుంది. కానీ, ఆరోగ్యవంతులైన పెద్దల్లో సాధారణ జలుబును నివారించలేదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. విటమిన్ సి లోపం రోగ నిరోధక వ్యవస్థను బలహీనపర్చవచ్చు కానీ, సప్లిమెంట్లు తీసుకున్నంత మాత్రాన వైరల్ ఇన్ఫెక్షన్లను అడ్డుకోలేదు. అయినప్పటికీ, కొన్ని పరిశోధనల ప్రకారం జలుబుగా ఉన్నప్పుడు రోజుకు 2 గ్రాముల విటమిన్ సి తీసుకుంటే దాని తీవ్రత 20 శాతం వరకు తగ్గించగలదు. కాబట్టి, నివారణ చర్యగా ముందుగా తీసుకునే కంటే జబ్బుగా ఉన్నప్పుడు విటమిన్ సి తీసుకుంటే మరింత ప్రభావం చూపుతుంది.
వాస్తవం: మన శరీరం లోపల, శరీరంపై ఉండే సూక్ష్మజీవుల సమూహంలో మార్పులకు అలర్జీతో వచ్చే వ్యాధులు పెరగడానికి లంకె ఉంటుంది. మంచి బ్యాక్టీరియాను పోషించుకోవడం అత్యవసరం. అయితే, అతిసారం, న్యుమోనియా వంటి హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడానికి చేతులు కడుక్కోవడం, నాణ్యమైన ఆహారం తినడం లాంటి పరిశుభ్రతకు సంబంధించిన అలవాట్లు పాటించాల్సిందే. అలాగని అతికి పోకుండా కనీస శుభ్రత పాటించడం మాత్రం మర్చిపోకండి.
వాస్తవం: ఇన్ఫెక్షన్ సోకిన తర్వాతనే శరీరంలో సహజ నిరోధకత అభివృద్ధి చెందుతుంది. అయితే సహజ నిరోధకత కొన్ని ఇబ్బందులతో వస్తుంది. పైగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వేర్వేరుగా ఉంటుంది. అధ్యయనాల ప్రకారం టీకాలు వ్యాధుల ప్రమాదం లేకుండా బలమైన, లక్షిత రోగ నిరోధకతను అందిస్తాయి. కాబట్టి, ఇన్ఫెక్షన్ మీద ఆధారపడటం కంటే టీకాలతో సురక్షితమైన, నమ్మకమైన ఇమ్యూనిటీని సమకూర్చుకోవచ్చు.
వాస్తవం: రోగ నిరోధకత అన్నిసార్లూ వయసుతోపాటు తగ్గిపోదు. వయసుతోపాటు ఇమ్యూనిటీ వైఫల్యానికి కారణమయ్యే ఇమ్యునోసెనెసెన్స్ కారణంగా కొత్త ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ప్రతిస్పందించే సామర్థ్యం తగ్గొచ్చు. కానీ, పెద్దలు పాత ఇన్ఫెక్షన్లు, టీకాల కారణంగా అభివృద్ధి చెందిన జ్ఞప్తి కణాలను (మెమరీ సెల్స్) నిలిపి ఉంచుకోగలరు. అలా ఇవి గతంలో పోరాడిన రోగ కారక క్రిములకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తాయి.