Health Tips | శాకాహారులకు బెస్ట్ ప్రొటీన్ డైట్ ఇదే..!
శాకాహారంతో (Health Tips) ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ బీ 12 వంటి పోషకాల లోపం తలెత్తుతున్నా వెజిటేరియన్ డైట్ ఇప్పటికీ బరువు తగ్గేందుకు, గుండెకు మేలు చేసేందుకు మెరుగైనదిగా చెబుతారు.
న్యూఢిల్లీ : శాకాహారంతో (Health Tips) ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ బీ 12 వంటి పోషకాల లోపం తలెత్తుతున్నా వెజిటేరియన్ డైట్ ఇప్పటికీ బరువు తగ్గేందుకు, గుండెకు మేలు చేసేందుకు మెరుగైనదిగా చెబుతారు. శాకాహారుల్లో ప్రొటీన్ లోపాన్ని చక్కదిద్దేందుకు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఉడకబెట్టిన బటానీలు రోజూ అరకప్పు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్ లభిస్తుంది. కూరల్లోనూ వీటిని వాడితే రుచి కూడా మెరుగవుతుంది. ఉడికించిన బటానీలను ఆనియన్స్, టొమాటో వేసి తీసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తీసుకుంటారు. వీటిని రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గుతారు. వేరుశెనగలో ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్లతో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉండటంతో వీటిని కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలిగి అతిగా తినడం తగ్గిస్తారు.
శరీరం బరువు పెరగకుండా ఇది తోడ్పడుతుంది. అర కప్పు వేరుశెనగలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని కూడా ఉడికించి తీసుకుంటే సులభంగా జీర్ణమవుతాయి. ఇక క్వినోవాలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ప్రొటీన్లతో పాటు ఇందులో మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్ సహా శరీరానికి మేలు చేసే పలు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వీటితో పాటు పప్పు ధాన్యాలు, బాదం పప్పులో అధిక ప్రొటీన్లు శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడంతో పాటు కండరాల బలోపేతానికి ఉపకరిస్తాయి.
Read More
Thank U Foods | థాంక్ యూ ఫుడ్స్.. చూపులేని వాళ్లతోనే నడుస్తోన్న సంస్థ ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శం!!
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- proteins
- soya
- vegan
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

