న్యూఢిల్లీ : మనలో చాలా మంది ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌తో (Health Tips) రోజును ప్రారంభించి తేలికపాటి డిన్నర్‌తో ముగించేందుకు ప్లాన్ చేస్తుంటారు. రోజులో ముఖ్యమైన లంచ్ గురించి మాత్రం పట్టించుకోరు. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ తరహాలోనే రోజంతా హుషారుగా ఉండేందుకు సరైన పోషకాలతో కూడిన లంచ్ తీసుకోవడం అంతే అవసరం.
బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది లేట్‌గా లంచ్ చేయడం అసలు భోజనాన్నే స్కిప్ చేయడం చేస్తుంటారు. దీంతో తలనొప్పి, అసిడిటీ, గ్యాస్ వంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. బిజీ షెడ్యూల్స్ కారణంగా లంచ్‌కు ఓ టైమ్ అంటూ పెట్టుకోకుండా తోచిన సమయంలో తినేస్తుంటారు. లేట్ లంచ్‌తో సమస్యలు ఎదుర్కొనే వారు సింపుల్ చిట్కాలు పాటిస్తే తలనొప్పి, అసిడిటీ, గ్యాస్ వంటి ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివాకర్ ఇన్స్టాగ్రాం వీడియోలో వెల్లడించారు.
ప్రతిరోజూ 11 గంటల నుంచి 1 గంట మధ్య లంచ్ చేయడం మేలని ఆమె చెబుతున్నారు. లంచ్ లేటయితే నీటిని కొద్ది కొద్దిగా తాగాలని, అరటి, ఆరంజ్, పపాయ వంటి పీచు ఉండే పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు నెయ్యి, బెల్లం వంటి ఫుడ్ కూడా లేట్ లంచ్ ఎఫెక్ట్స్‌ను తగ్గిస్తుందని ఈ వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు.
Read More :