ముంబై : అందం, ఆరోగ్యం సొంతం చేసుకునేందుకు సినీ తారలు, సెలబ్రిటీలు ఏం చేసేందుకైనా (Viral Video) వెనుకాడరు. గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేయడం, యోగా, ధ్యానం దగ్గరి నుంచి కఠిన ఆహార నియమాలు పాటించడం వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్వీట్లు, కొవ్వు, మసాలాలతో కూడిన ఆహారాన్ని దరిచేరనివ్వరు.
నోరూరించే వంటకాలు ఎదురుగా ఉన్నా వాటిని తినేందుకు సాహసించారు. అయితే వారం రోజులూ కఠినంగా డైట్ నియమాలు పాటించినా చీట్ మీల్ పేరుతో వారంలో ఒకరోజు వారికి ఇష్టమైన ఆహార పదార్ధాలను రుచి చూస్తారు. ఇక బాలీవుడ్ భామ శిల్పా శెట్టి గుజరాతీ స్నాక్స్‌ను సండే ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో శిల్పా శెట్టి శనగ పిండితో క్రిస్పీగా తయారుచేసే స్నాక్ ఫఫ్ధాను ఆస్వాదించారు. ఆపై ఆమె ఢోక్లా, ఖండ్వి, జిలేబిని ఇష్టంగా ఆరగించడం ఈ క్లిప్‌లో చూడొచ్చు. మీకెంతో ఇష్టమైనదైతే చీట్ మీల్‌ను ఎంజాయ్ చేయవచ్చు..ఇది కూడా అంతే..! అని శిల్పా శెట్టి రాసుకొచ్చారు.
Read More :