Health tips : సైలెంట్ కిల్లర్‌గా వ్యవహరించే హైపర్‌టెన్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం, గుండెపోటు వంటి తీవ్ర అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉంది. బీపీని నియంత్రించేందుకు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు ఆహార నియమాలను పాటిస్తే అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, విటమిన్ సీ అధికంగా ఉండే ఆహారంతో రక్తపోటును సరైన రీతిలో ఉంచుకోవచ్చు.
చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులతో నిండిన ఆహారాన్ని తగ్గించడం, వ్యాయామం ద్వారా బీపీని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక నైట్రేట్స్ అధికంగా ఉన్న ఆహారంతో బీపీ 24 గంటల్లో మెరుగవుతుందని పేర్కొన్నారు. రక్తపోటును సరైన లెవెల్స్‌లో ఉంచేందుకు పాలకూర వంటి ఆకుకూరలు, క్యాబేజ్ వంటి ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి.
అరటిపండు, బెర్రీస్, పచ్చి బీట్రూట్, కివీస్‌తో పాటు పప్పుధాన్యాలు కూడా శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలను ఆహారంలో భాగం చేసుకునేందుకు వాటిని సలాడ్లు, కూరలు, సూప్స్‌లో వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.