Heart Health | ఈ ఆహారంతో హృదయం పదిలం..8 వారాల్లో మెరుగైన ఫలితాలు
ఆరోగ్యంపై శాకాహారం, మాంసాహార ప్రభావాలపై (Heart Health) హాట్ డిబేట్ సాగుతుండగా మొక్కల ఆధారిత ఆహారంతో సానుకూల ఫలితాలు ఉంటాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : ఆరోగ్యంపై శాకాహారం, మాంసాహార ప్రభావాలపై (Heart Health) హాట్ డిబేట్ సాగుతుండగా మొక్కల ఆధారిత ఆహారంతో సానుకూల ఫలితాలు ఉంటాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. వెగాన్, జంతు సంబంధ ఆహారాలను తీసుకునే వారిపై స్టాన్ఫార్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. రెండు నెలల పాటు సాగిన ఈ అధ్యయన వివరాలు జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్, శరీర బరువు వంటి ప్రాతిపదికల ఆధారంగా అధ్యయనంలో పాల్గొన్న వారి గుండె ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఎనిమిది వారాల పరిశోధన అనంతరం వెగాన్ డైట్ తీసుకున్న వారిలో బరువు తగ్గుదల, చెడు కొలెస్ట్రాల్ తగ్గుదల, ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుదలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. మొక్కల ఆధారిత ఆహారంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు.
గుండె ఆరోగ్యానికి మొక్కలేతర ఆహారంతో పోలిస్తే ప్లాంట్ బేస్డ్ డైట్ మెరుగైనదని గతంలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైన అంశాలను తాజా అధ్యయనం నిర్ధారించినట్లయిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక మొక్కల ఆధారిత ఆహారం విషయానికి వస్తే కూరగాయలు, పప్పుధాన్యాలు, నట్స్, పండ్లు వంటివి అధికంగా తీసుకుంటే మేలు.
Read More :
MBBS Seats | దేశంలో ఏటా ఎంత మంది డాక్టర్లు తయారవుతున్నారో తెలుసా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Health news
- heart health
- meat
- vegan
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

