Cholesterol Levels | కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే యోగాసనాలు ఇవి.. గుండెకు ఎంతో మేలు చేస్తాయి..
సాధారణంగా 30 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టిన తర్వాత శరీరంలో మెటాబాలిజం, జీవనశైలి, ఒత్తిడి స్థాయిల్లో మార్పులు కనిపించడం సహజం. దీర్ఘకాలం పని చేయడం, శారీరక చలనం తగ్గిపోవడం, అసమతుల్య ఆహారపు అలవాట్ల వంటివి క్రమంగా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశం ఉంది.
Cholesterol Levels | సాధారణంగా 30 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టిన తర్వాత శరీరంలో మెటాబాలిజం, జీవనశైలి, ఒత్తిడి స్థాయిల్లో మార్పులు కనిపించడం సహజం. దీర్ఘకాలం పని చేయడం, శారీరక చలనం తగ్గిపోవడం, అసమతుల్య ఆహారపు అలవాట్ల వంటివి క్రమంగా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశం ఉంది. అధిక కొలెస్ట్రాల్‌ను వైద్యపరంగా హైపర్కొలెస్ట్రోలేమియా అని పిలుస్తారు. ఇది నియంత్రణలో లేకపోతే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామంతో పాటు యోగాను కూడా రోజువారీ జీవితంలో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైన సమీక్షా అధ్యయనం ప్రకారం యోగా సాధన చేయడం వల్ల LDL (చెడుకొలెస్ట్రాల్), HDL (మంచి కొలెస్ట్రాల్), రక్తపోటు స్థాయిలు మెరుగుపడినట్లు వెల్లడైంది.
భుజంగాసనం, అర్ధ మత్స్యేంద్రాసనం..
కొన్ని యోగా ఆసనాలు రక్తప్రసరణను మెరుగుపరచడం, జీర్ణక్రియను ఉత్తేజించడం, మెటబాలిక్ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. కనుక కొలెస్ట్రాల్‌ను సహజంగా నియంత్రించడంలో ఉపయోగపడే ఆరు సులభమైన యోగా ఆసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భుజంగాసనం (కోబ్రా పోజ్) న్యూరోఎండోక్రైన్ వ్యవస్థపై ప్రభావం చూపి గ్లూకోజ్, లిపిడ్ మెటాబాలిజాన్ని మెరుగుపరచవచ్చని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా అధ్యయనం సూచిస్తోంది. ఈ ఆసనాన్ని చేయాలంటే పొట్టపై పడుకుని, చేతులను భుజాల దగ్గర ఉంచాలి. మెల్లగా ఛాతిని పైకి ఎత్తుతూ, మోచేతులను కొంచెం వంచి భుజాలను రిలాక్స్‌గా ఉంచాలి. కొన్ని శ్వాసల పాటు ఈ స్థితిలో ఉండి తిరిగి ప్రారంభ స్థితికి రావాలి. ఈ ఆసనం రక్తప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అర్ధ మత్స్యేంద్రాసనం కూర్చుని చేసే మలుపు ఆసనం. ఇది పొట్టలోని అవయవాలను మసాజ్ చేస్తూ జీర్ణక్రియను, మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాళ్లను చాపి కూర్చుని ఒక కాలును వంచి ఎదురు తొడ బయట ఉంచాలి. తరువాత శరీరాన్ని వంచిన కాలి వైపు తిప్పుతూ వెన్నును నిటారుగా ఉంచాలి. దీన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల అంతర్గత అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
ధనురాసనం, సర్వాంగాసనం..
ధనురాసనం చేయడం ద్వారా శరీరం విల్లు ఆకారంలో ఉంటుంది. ఈ ఆసనంలో ఛాతి, కాళ్లను పైకి ఎత్తి చేతులతో కాళ్లను పట్టుకోవాలి. ఇది శరీర ముందుభాగాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేస్తూ జీర్ణ అవయవాలను ఉత్తేజిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడటం ద్వారా పరోక్షంగా కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయపడుతుంది. సేతు బంధాసనం (బ్రిడ్జ్ పోజ్) ఛాతిని విప్పి రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెన్నుపై పడుకుని మోకాళ్లు వంచి పాదాలను నేలపై ఉంచాలి. తరువాత నడుమును పైకి ఎత్తుతూ పాదాలు, భుజాలపై ఒత్తిడి పెట్టాలి. కొన్ని శ్వాసల పాటు ఈ స్థితిలో ఉండాలి. ఈ ఆసనం వెన్ను బలాన్ని పెంచి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. సర్వాంగాసనం థైరాయిడ్ గ్రంధిని ఉత్తేజింపజేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ ఆసనంలో శరీరాన్ని భుజాలపై నిలబెట్టి కాళ్లను పైకి ఎత్తాలి. మొదటిసారి చేసే వారు నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది. పశ్చిమోత్తానాసనం ముందుకు వంగే ఆసనం. ఇది వెన్ను, హ్యామ్‌స్ట్రింగ్స్, వెన్నెముకను స్ట్రెచ్ చేస్తూ పొట్టపై మృదువైన ఒత్తిడి కలిగిస్తుంది. కాళ్లను చాపి కూర్చుని మెల్లగా ముందుకు వంగి పాదాలను అందుకునేలా ప్రయత్నించాలి. ఈ ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచి మెటబాలిజాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం..
యోగా ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణ సాధ్యమైనప్పటికీ ఇది ఆరోగ్యకర జీవనశైలితో కలిపి పాటించినప్పుడు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఫైబర్, పూర్తి ధాన్యాలు, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు. క్రమమైన శారీరక చలనం, సరిపడా నిద్ర, ఒత్తిడి నియంత్రణ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా తీసుకోవడం తగ్గించడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 30 ఏళ్ల తర్వాత జీవనశైలి మార్పులు, మెటబాలిజం మార్పుల కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు నిశ్శబ్దంగా పెరుగుతాయి. కాబట్టి సులభమైన యోగా ఆసనాలను రోజువారీ జీవితంలో చేర్చుకోవడం ద్వారా రక్తప్రసరణ, జీర్ణక్రియ, మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. సరైన ఆహారం, క్రమమైన వ్యాయామంతోపాటు యోగా సాధన చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

