Skin Glow : కాంతులీనే చర్మం కోసం పలువురు రకరకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడుతూ ప్రయోగాలు చేస్తుంటారు. చర్మ సౌందర్యాన్ని సహజ సిద్ధంగా పెంపొందించి చర్మ నిగారింపులో కీలకంగా పనిచేసే ఆహార పదార్ధాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) 2020 పరిశోధనా కథనంలో ప్రస్తావించిన వివరాల ప్రకారం పోషకాహారానికి చర్మ ఆరోగ్యంతో సంబంధం ఉందని వెల్లడైంది.
దెబ్బతిన్న చర్మాన్ని పోషకాహారం, మన ఆహారపు అలవాట్లతో చక్కదిద్దవచ్చని పోషకాహార నిపుణులతో పాటు డెర్మటాలజిస్టులూ చెబుతున్నారు. మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఐదు భారతీయ సూపర్ ఫుడ్స్‌ను ఎంచుకోవాలని ఎండీ, డెర్మటాలజిస్ట్ డాక్టర్ జుష్య భాటియా సరిన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. నట్స్ నుంచి కూరగాయాలు, మసాలా దినుసులు, తృణధాన్యాల వంటివి వివిధ రెసిపీల్లో వాడితే చర్మ సంరక్షణ, చర్మ ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నారు.
టమాటాలు చర్మ సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తాయని ఆమె చెబుతున్నారు. ఇందులో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఏజింగ్, యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి మేలు చేస్తాయి. టమాటా సూప్స్, టమాటా కర్రీ వంటి వండిన టమాటా డిష్‌లను అధికంగా తీసుకోవాలని ఇన్స్టాగ్రాం రీల్లో ఆమె వివరించారు. ఇంకా రెడ్ క్యారెట్స్, వాటర్ మెలన్స్, పపాయాల వంటివి కూడా చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు. ఇక చర్మ ఆరోగ్యానికి మేలు చేసే ఐదు ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
టమాటాలు
ఓట్స్
వేరుశనగ
పాలకూర
పసుపు
Read More :
Ferocious Dogs: 23 రకాల శునక జాతులపై బ్యాన్ … ఆ 23 రకాల శునకాలు ఇవే..