Ferocious Dogs: 23 రకాల శునక జాతులపై బ్యాన్ … ఆ 23 రకాల శునకాలు ఇవే..
Ferocious Dogs: ప్రమాదకర జాతికి చెందిన శునకాల జాబితాను ఇవాళ కేంద్రం రిలీజ్ చేసింది. ఆ లిస్టులో 23 రకాల కుక్కలు ఉన్నాయి. దాంట్లో ఫిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్‌వీలర్, మాస్టిఫ్స్ జాతి కుక్కలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: ప్రమాదకర జాతికి చెందిన శునకాల జాబితాను ఇవాళ కేంద్రం రిలీజ్ చేసింది. ఆ లిస్టులో 23 రకాల కుక్కలు ఉన్నాయి. దాంట్లో ఫిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్‌వీలర్, మాస్టిఫ్స్ జాతి కుక్కలు ఉన్నాయి. పెంపుడు కుక్కలుగా ఉన్న ఆ 23 రకాల జాతి(Ferocious Dogs) శునకాలను దూరంగా ఉంచాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తన ఉత్తర్వుల్లో సూచించింది. ఈ 23 రకాల జాతుల కుక్కలను ఇక ముందు బ్రీడింగ్ చేయకుండా స్టెరిలైజ్ చేయాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొన్నది. కొన్ని రకాల జాతి కుక్కలను బ్రీడింగ్‌కు దూరంగా ఉంచాలని కోరుతూ పౌర సంఘాలు, జంతు సంక్షేమ సంస్థల నుంచి తమకు ప్రతిపాదనలు వచ్చినట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. 23 రకాల శునకాలను ఫెరోసియస్ బ్రీడ్ డాగ్స్‌గా పరిగణించారు. వీటి వల్ల మనుషులకు ప్రమాదం ఉన్నట్లు తెలిపారు.
ఫిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్‌వీలర్, మాస్టిఫ్స్, సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్న్‌జాక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిత, మాస్టిఫ్స్, టెర్రైర్స్, రొడేషియా రిడ్జ్‌బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కెనారియో, అక్బాస్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బందోగ్ జాతి కుక్కలు ఆ లిస్టులో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

