Health Tips | ఈ అలవాట్లతో అధిక రక్తపోటు ముప్పు..!
ఆధునిక జీవనశైలి కారణంగా పెద్దసంఖ్యలో ప్రజలు రక్తపోటు (Health Tips) బారినపడుతున్నారు. హైబీపీ నియంత్రణలో లేకుంటే అది ఇతర అనారోగ్యాలకూ దారితీస్తుంది.
న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలి కారణంగా పెద్దసంఖ్యలో ప్రజలు రక్తపోటు (Health Tips) బారినపడుతున్నారు. హైబీపీ నియంత్రణలో లేకుంటే అది ఇతర అనారోగ్యాలకూ దారితీస్తుంది. బీపీ అదుపులో లేకుంటే హృద్రోగ ముప్పూ వెంటాడుతుంది. బీపీని ఎప్పటికప్పుడు నియంత్రించుకోవడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మనకు తెలియకుండానే మన అలవాట్లు బీపీని పెంచుతుంటాయి.
శారీరక వ్యాయామం చేయనివారు, చురుకైన జీవనశశైలి అనుసరించని వారిలో అధిక రక్తపోటుతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. శారీరక వ్యాయామం లోపిస్తే అధిక బరువు పెరగడం, ఊబకాయం ఫలితంగా హైబీపీ వేధిస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు అరగంట సమయం వ్యాయామానికి వెచ్చిస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
వాకింగ్ లేదా ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలతో చురుకుగా ఉండవచ్చు. ఇక స్మోకింగ్, పొగాకు నమలడం, మద్యపానం బీపీని పెంచడమే కాకుండా క్యాన్సర్ ముప్పునూ ముందుకుతెస్తుంది. ఇక ఒత్తిడి బీపీని పెంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎంతటి మనిషినైనా చిత్తు చేసే ఒత్తిడిని నివారించేందుకు స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనుసరించాలి. వీటితో పాటు కెఫీన్‌ను అధికంగా తీసుకోవడం, ఉప్పును మోతాదు మించి వాడటం హైబీపీకి కారణమవుతుంది.
Read More :
Samantha | ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత నయా స్టిల్.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా హాట్ క్యాప్షన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

