Bloating | ప్రస్తుత తరుణంలో జీర్ణ సమస్యలు అనేవి చాలా మందికి కామన్ అయిపోయాయి. అప్పుడే పుట్టిన శిశువులు కూడా జీర్ణ సమస్యల బారిన పడుతున్నారు. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకం, గుండెల్లో మంటగా అనిపించడం.. ఇలాంటివన్నీ జీర్ణ సమస్యలుగా చెప్పవచ్చు. అయితే వీటిల్లో ఒకటి వచ్చిందంటే మిగిలినవి కూడా ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. కనుక ఏ జీర్ణ సమస్య వచ్చినా దాన్ని తగ్గించుకోవాలి. లేదంటే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఇక చాలా మందికి రాత్రి పూట భోజనం చేసిన అనంతరం కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీంతోపాటు ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే ఇందుకు పలు ప్రధాన కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట చాలా మంది కొవ్వు పదార్థాలను తింటుంటారు. అయితే వీటిని రాత్రి పూట తినకూడదు. రాత్రి భోజనంలో కొవ్వు పదార్థాలను తింటే అవి సరిగ్గా జీర్ణం కావు. పేగుల్లో కదలికలు సరిగ్గా ఉండవు. జీర్ణాశయంలోనే కొవ్వు పదార్థాలు ఎక్కువ సమయం పాటు ఉంటాయి. ఇలా దీర్ఘకాలంలో రాత్రి పూట కొవ్వు పదార్థాలను తినడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. దీన్ని అజీర్తి కారణంగా వచ్చిన కడుపు ఉబ్బరం అని చెప్పవచ్చు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఈరకంగా కడుపు ఉబ్బరం వస్తుంది. ఇక కొందరికి పాలు లేదా పాల ఉత్పత్తులు పడవు. పాలలో ఉండే లాక్టోజ్ అనే పదార్థం కారణంగా ఆయా ఉత్పత్తులను తీసుకున్నప్పుడు సరిగ్గా జీర్ణం కావు. ఇవి గ్యాస్ ట్రబుల్ ను కలగజేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం వస్తుంది. మీరు పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరం వస్తుంటే వాటి వల్లే ఆ సమస్య వస్తుందని గమనించాలి.
కొందరికి ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకుంటే పడదు. అజీర్తి, గ్యాస్ ఏర్పడుతాయి. దీంతో కడుపు ఉబ్బరం వస్తుంది. ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకుంటే కడుపు ఉబ్బరం ఏర్పడితే ఆయా ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే శీతల పానీయాలు, సోడాలను తాగడం వల్ల కూడా కొందరికి పడవు. ఫలితంగా గ్యాస్ ట్రబుల్ సమస్య ఏర్పడుతుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా సోడియం అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా సరిగ్గా జీర్ణం అవకపోతే గ్యాస్ ఏర్పడి పొట్టలో ఉబ్బరం వస్తుంది. దీంతోపాటు ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.
కొందరు అతిగా భోజనం చేస్తుంటారు. రాత్రిపూట సహజంగానే వారు ఎక్కువ ఆహారం తింటుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. ఇది గ్యాస్, అజీర్తిని కలగజేస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం కూడా వస్తుంది. రాత్రి పూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తినాలి. అలాగే వీలైనంత త్వరగా భోజనం చేయాలి. ఇలా పలు సూచనలు పాటిస్తూ ఆయా ఆహారాలను తీసుకోవడం మానేస్తే కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయట పడవచ్చు. భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తింటుంటే కడుపు ఉబ్బరం నుంచి బయట పడవచ్చు. దీంతో గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.