మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, లవణాలు.. ఇలా అన్ని రకాల పోషకపదార్థాలు ఉన్న ఆహారాలను తీసుకుంటేనే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. మనం తీసుకునే ఆహారాల్లో ఏ ఒక్క విటమిన్, ఖనిజం, లవణం తగ్గినా అవి ఏదో ఒక వ్యాధికి గురయ్యేందుకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉన్నది. గర్భిణీలు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఐరన్ లోపం కారణంగా తక్కువ బరువున్న పిల్లలు పుట్టే అవకాశాలుంటాయి. అదేవిధంగా శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. అందుకని ఐరన్ ఎక్కువగా లభించే ఆహారాలను నిత్యం తీసుకోవాలి.
ఐరన్ లోపం ఉన్నవారు..