Garlic Benefits | వెల్లుల్లి.. ప్రతి ఇంట్లో ప్రతి వంటలోనూ వాడతారు. చాలా మంది వెల్లుల్లి తినడానికి ఇష్ట పడరు కొందరికైతే దాని వాసన కూడా పడదు.. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి దివ్యమైన ఔషధంగా పని చేస్తుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి పలు హెల్త్ బెనిఫిట్లు ఉన్నాయి. మానవుడిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడంలో వెల్లుల్లిలోని యాంటీ యాక్సిడెంట్లు కీలకంగా వ్యవహరిస్తాయి. జీర్ణక్రియకు మేలు చేసే వెల్లుల్లి గ్యాస్ వంటి సమస్యలను దరి చేరనివ్వదు.. అధిక రక్తపోటుతో బాధ పడే వారికి ఎంతో మేలు చేస్తుంది.
వెల్లుల్లిలోని ఎక్కువ పరిమాణంలో అడ్రినలైన్ రిలీజ్ చేయడంతో నాడీ వ్యవస్థ ఎంతో ఉత్తేజితం కావడంతో శరీరంలో జీవ క్రియ మెరుగు పరుస్తుంది. శరీరంలో పేరుకుపోయే క్యాలరీలను కరిగించేస్తుంది. కనుక ప్రతి రోజూ ఉదయం లేవగానే పరగడుపుతోనే వెల్లుల్లి రెబ్బలు నూరుకుని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఎంతో ప్రయోజనంగా మారుతుంది. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ కెమికల్.. ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో తోడ్పాటునిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Mahindra Scorpio- N | మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో కొత్త ఫీచర్లు.. అవేమిటంటే..?!
Moto G85 5G | 10న భారత్ మార్కెట్లోకి మోటో జీ85 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
CMF Phone 1 | 50-ఎంపీ కెమెరా.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో సీఎంఎఫ్ ఫోన్1 ఆవిష్కరణ..!