వర్షాకాలం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు వర్షాకాలాన్ని ఎంజాయ్ చేస్తారు. మరికొందరు భయంభయంగా గడుపుతారు. చినుకులు పడుతున్నప్పుడు పకోడీలు తినాలని కొందరు చూస్తుంటే..వెంట్రుకలు రాలిపోతాయని, లేనిపోని వ్యాధులు వస్తాయని మరికొందరు భయపడుతుంటారు. వర్షాకాలంతో మనుషులకు మిశ్రమ అనుభవాలుంటాయి. ఆరోగ్యంపరంగా చూస్తే వర్షాకాలం కళ్లను అతిజాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేది పాత సామెత. మన శరీరంలోని అన్ని అవయవాల్లో కళ్లే ప్రధానం. అందుకే వాటిని అతిజాగ్రత్తగా కాపాడుకోవాలి. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. అందుకే కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటున్నారు నేత్ర వైద్య నిపుణులు. వర్షాకాలంలో కంటి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచించారు.