ఒకప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య అరుదుగా వినిపించేది. మారిన జీవన విధానం కారణంగా కిడ్నీ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వయసు పైబడిన వారిలో అధికంగా కనిపించే ఈ రుగ్మత ఇప్పుడు చిన్నారులనూ కబళిస్తున్నది. యూరిన్ ఇన్ఫెక్షన్లు మొదలుకొని కిడ్నీ ఫెయిల్యూర్స్ లాంటి సమస్యలు పిల్లల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నెలల వయసున్న పిల్లల్లో కూడా కిడ్నీ సమస్యలు ఏర్పడవచ్చు. అయితే ప్రధానంగా పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో వాపు, రాళ్లు, రిఫ్లక్స్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి.
నెలల వయసున్న చిన్నారుల నుంచి 16 ఏండ్ల పిల్లల వరకు మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొంత మంది శిశువుల్లో పుట్టుకతోనే కిడ్నీ అస్వాభావికంగా ఉంటుంది. అంటే కిడ్నీలో వాపు ఉంటుంది. దీనినే వైద్యపరిభాషలో ‘హైడ్రో నెఫ్రోసిస్’ అంటారు. దీని వల్లే యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
కిడ్నీ వ్యవస్థలో రెండు కిడ్నీలు, యూరేటర్, యూరినరీ బ్లాడర్ ఉంటాయి. మూత్రం కిడ్నీ నుంచి యురేటర్ ద్వారా యూరినరీ బ్లాడర్‌లోకి వచ్చి అక్కడి నుంచి బయటికి వస్తుంది. కానీ, కొంత మంది పిల్లల్లో కిడ్నీ నుంచి వచ్చిన మూత్రం యూరినరీ బ్లాడర్‌కు వచ్చి అక్కడి నుంచి బయటికి రాకుండా తిరిగి వెనక్కి వెళ్లి కిడ్నీకి చేరుతుంది. దీనినే రిఫ్లక్స్ లేదా వీయూఆర్ (వెసికో యూరెటరిక్ రిఫ్లక్స్) అంటారు. ఈ సమస్య ఉన్న వారికి కిడ్నీలో మచ్చలు ఏర్పడి, వాటి పనితీరు మందగిస్తుంది. అందుకని పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ తలెత్తినప్పుడు ముందుగా కిడ్నీలో వాపు, రిఫ్లక్స్ ఉందో లేదో తెలుసుకోవాలి. అందుకోసం ఎంసీయూజీ స్కాన్ చేయాల్సి ఉంటుంది.
ఈ రిఫ్లక్స్‌లో మొత్తం 5 గ్రేడ్లు ఉంటాయి. వీటిలో గ్రేడ్-1నుంచి గ్రేడ్-3 వరకు లోగ్రేడ్ అంటారు. ఈ లోగ్రేడ్ రిఫ్లక్స్ ఉన్న పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ సమస్య దానంతట అదే తగ్గుముఖం పడుతుంది. గ్రేడ్-4, గ్రేడ్-5 హైగ్రేడ్ అంటారు. అయితే హైగ్రేడ్ రిఫ్లక్స్ ఉన్న పిల్లల విషయానికి వస్తే.. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య తగ్గే అవకాశం 40 శాతం మాత్రమే ఉంటుంది. ఒకవేళ సమస్య తగ్గని పిల్లలకు యూరెటరిక్ రీ-ఇంప్లాంటేషన్ సర్జరీ చేసి చికిత్స అందిస్తారు.
ఈ మధ్య చాలామంది పిల్లలు కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారు. పిల్లల కిడ్నీలో రాళ్లు రావడానికి ఆహార నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. ఎక్కువ మోతాదులో మాంసాహారం తీసుకున్నా లేదా ఉప్పుతో కూడిన పదార్థాలు అధికంగా తీసుఒక వాహనం ప్రయాణించాలంటే ఇంధనం ఎంత అవసరమో..
ఒక మనిషి బతకాలంటే రక్తం కూడా అంతే అవసరం. అంతటి ప్రాధాన్యమున్న రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీలది కీలక పాత్ర. వీటి పనితీరు మందగిస్తే.. మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ క్రమంలో కిడ్నీల ప్రాధాన్యం, కిడ్నీ వ్యాధులు, అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మార్చి 13ను ప్రపంచ కిడ్నీ దినంగా పరిగణిస్తున్నారు. దీనిని పురస్కరించుకుని పిల్లల్లో తలెత్తే కిడ్నీ సమస్యలు, వాటికి గల కారణాలు, వ్యాధి లక్షణాలు, అందుబాటులోఉన్న చికిత్స తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.కున్నా, తగిన మోతాదులో నీరు తాగకపోయినా, ఎక్కువ మోతాదులో పాలు తాగుతున్నా పిల్లల కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
పిల్లల కిడ్నీల్లో చిన్న పరిమాణంలో ఉన్న రాళ్లు మందులతో కరిగిపోతాయి. అందుకోసం నీరు బాగా తాగాలి. తాజా పళ్లు తీసుకోవాలి. సాధారణంగా 10 మిల్లీమీటర్ల కన్నా పెద్ద పరిమాణంలో రాళ్లు ఉండి, అవి యూరిటరీలో అడ్డుపడుతూ ఉంటే అప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది.
కిడ్నీ ఫిల్టర్స్ (నెఫ్రాన్స్) ద్వారా ప్రొటీన్లు లీకైనప్పుడు ఏర్పడే సమస్యను నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్య వల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.
నెఫ్రోటిక్ సిండ్రోమ్ వల్ల ప్రధానంగా కంటి వాపు వస్తుంది. సమస్య తీవ్రమైతే పొట్ట, కాళ్లు, చేతుల్లో వాపు ఏర్పడుతుంది. నిర్లక్ష్యం చేస్తే శరీరం మొత్తం వాపు వస్తుంది. ఈ పరిస్థితిని ‘ఎనసార్క’ అంటారు. వీరికి సరైన సమయంలో చికిత్స అందిస్తే కిడ్నీలు పూరిగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.
పెద్ద పిల్లల్లో అయితే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వినియోగించడం, గ్లోమరెలో నెఫ్రైటిస్ (యూరిన్‌లో ప్రొటీన్, బ్లడ్ లీక్ కావడం) వల్ల ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వస్తుంది. ఈ సమస్య ఉన్న పిల్లలకు రక్తపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో శరీరం మొత్తం వాపునకు గురవుతుంది. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో వ్యర్థ పదార్థాలు అంటే బ్లడ్ యూరియా, క్రియాటినిన్ లాంటివి రక్తంలో పేరుకుపోతాయి. ఈ సమస్య ఉన్న పిల్లలకు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. డయాలసిస్ రెండు రకాలుగా ఉంటాయి. అవి హీమో డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. ఈ రెండిటిలో వైద్యులు సూచించిన దానిని చేయించుకోవాల్సి ఉంటుంది.
నెలల వయసున్న శిశువుల్లో క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ రావడానికి గల ప్రధాన కారణం కిడ్నీ ఏర్పడటంలోనే లోపం ఉండటం. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువుకు కిడ్నీలు సరిగ్గా ఏర్పడవు. దీని వల్ల శిశువు మూత్ర విసర్జన చేయదు. డిస్క్లాస్టిక్ కిడ్నీస్ లేదా పోస్టీరియర్ యురీత్రల్ వాల్వ్స్ (పియువి) కారణాల వల్ల క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ వస్తుంది. అంతే కాకుండా గ్లోమరెలో నెఫ్రైటీస్ బాధిత పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోయినా, డయాలసిస్ చేయించకపోయినా క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్య ఉన్న పిల్లలకు జీవితకాలం డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. లేదా కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుంది. మూడేళ్లలోపు పిల్లలకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయడానికి వీలు లేదు. మూడేండ్లు దాటిన తర్వాత చేయవచ్చు. అయితే సాధారణంగా తల్లిదండ్రులే కిడ్నీని దానం చేస్తారు.
– మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ వి.వి.ఆర్.సత్యప్రసాద్
పిడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్,
హైదరాబాద్