మనం తినే ఆహారం మన దంతాల ఆరోగ్యం మీద గొప్ప ప్రభావాన్నే చూపుతుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం, ఒకసారి ఫ్లాసింగ్ చేసుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నప్పటికీ తినే తిండి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పంటి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
వీటిలో చక్కెరలు ఎక్కువగా ఉండి దంతాలకు అతుక్కుపోతాయి. దీంతో నోట్లో హానికరమైన బ్యాక్టీరియా పెరిగిపోతుంది. కాలక్రమంలో ఇది ఇన్ఫెక్షన్లు, క్యావిటీలు, దంతక్షయానికి దారితీస్తుంది.
వీటితో ఊబకాయం మాత్రమే కాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. వీటిలో కార్బొహైడ్రేట్లు ఎక్కువ. ఇవి కూడా దంతాలపై క్యావిటీలు కలిగించే బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. పండ్ల మధ్యలో ఇరుక్కొని ఇతర దంత సమస్యలకూ కారణమవుతాయి.
వీటిలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నోట్లో బ్యాక్టీరియాతో చర్య జరిపి ఆమ్లం ఉత్పత్తికి దారితీస్తాయి. ఈ ఆమ్లం దంతాలను ధ్వంసం చేస్తుంది. కాబట్టి సాఫ్ట్ డ్రింక్ తీసుకోవాలనుకుంటే వాటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిదట.
ఆల్కహాల్ సేవనం కూడా దంతాలను దెబ్బతీస్తుంది. నోరు పొడిబారిపోయేలా చేస్తుంది. దీంతో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. మన దంతాలు పాడుకాకుండా చూడటంలో లాలాజలానిదీ కీలకపాత్రే. పైగా చక్కెరలు ఎక్కువగా ఉండే ఆల్కహాల్ పానీయాలు దంతాలపై పాచి ఏర్పడేలా చేస్తాయి. క్యావిటీలకు దారితీస్తాయి.
ఎండు ద్రాక్ష, ఖర్జూరలు, అంజీర్, ఆప్రికాట్, పీచ్ లాంటి డ్రై ఫ్రూట్స్ జిగురుగా, ఎక్కువ చక్కెరలతో నిండి ఉంటాయి. ఇవి తిన్నాక పండ్లు సరిగ్గా తోముకోకపోతే క్యావిటీలు వచ్చే అవకాశం ఎక్కువ.
విటమిన్ సి ఎక్కువగా ఉండే పుల్లటి పండ్లు దంతాల ఆరోగ్యానికి మంచివి. కానీ, వీటిలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పంటిపై పొర ఎనామెల్‌ను క్షయం చేస్తాయి. దీంతో సెన్సిటివిటీ, క్యావిటీలు వస్తాయి.
కాలక్రమంలో టీ, కాఫీలు పండ్లపై మచ్చలను ఏర్పరుస్తాయి. తెల్లదనం కోల్పోయేలా చేస్తాయి. ఇవి నోట్లో లాలాజలం ఉత్పత్తిని తగ్గిస్తాయి. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.