పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మూత్రాన్ని చాలాసేపు ఉగ్గబట్టుకుంటూ ఉంటారు. టాయిలెట్ వసతి లేకపోవడం, ఉద్యోగంలో సమావేశాల్లో తలమునకలవడం, ప్రయాణాల్లో ఉండటం మొదలైన వాటి కారణంగా మరో ప్రత్యామ్నాయం లేక ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కొన్నిసార్లయితే బద్ధకం వల్ల కూడా మూత్రం ఉగ్గబట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడంటే అంత ఇబ్బందిగా ఉండకపోచ్చు కానీ, మూత్రం ఉగ్గబట్టుకోవడం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం అది మన లైంగిక, మెదడు సంబంధ, కిడ్నీల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.