Kidneys Health | ప్రస్తుతం చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కిడ్నీళ్లో రాళ్లు ఉండడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మద్యం ఎక్కువగా సేవించడం, ఉప్పు అధికంగా తినడం, డయాబెటిస్ వంటి పలు కారణాల వల్ల చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. దీంతో కొందరికి కిడ్నీలు చెడిపోయి పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారుతోంది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవడంతోపాటు ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోయి కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. కొన్ని రకాల పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే పరిస్థితి మెరుగు పడుతుంది. అలాగే కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బెర్రీ పండ్ల జాతికి చెందిన రాస్ప్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, క్రాన్ బెర్రీలను తరచూ తింటుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పండ్లలో పొటాషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లో ఉండే ఆంథో సయనిన్స్, ఎల్లాజిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల వాపులను తగ్గిస్తాయి. కణాలు డ్యామేజ్ అవకుండా ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. క్రాన్ బెర్రీలను తినడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. కిడ్నీలపై పడే భారం కూడా తగ్గుతుంది. అయితే ఈ పండ్లను నేరుగానే తినాలి. డ్రై ఫ్రూట్స్ రూపంలో, ఫ్రిజ్‌లో నిల్వ చేసినవి తినకూడదు. లేదంటే ప్రయోజనాలు కలగవు. అలాగే యాపిల్ పండ్లను తింటున్నా కూడా కిడ్నీలకు ఎంతగానో మేలు జరుగుతుంది. యాపిల్ పండ్లలోనూ పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి కిడ్నీలకు మేలు చేస్తాయి. ఈ పండ్లలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. యాపిల్ పండ్లను రోజూ ఒకటి చొప్పున తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది.
ద్రాక్ష పండ్లలోనూ పొటాషియం అధికంగానే ఉంటుంది. అలాగే రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల కిడ్నీలు వాపులకు గురికాకుండా ఉంటాయి. ద్రాక్ష పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటుండాలి. దీంతో మేలు జరుగుతుంది. పైనాపిల్ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచగలవు. పైనాపిల్ పండ్లలో ఉండే పొటాషియం, ఫాస్ఫరస్ కిడ్నీలకు మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వాపులకు గురికాకుండా చూసుకోవచ్చు. పైనాపిల్ పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకున్నా మేలు జరుగుతుంది.
పుచ్చకాయలు మనకు ఇప్పుడు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఈ పండ్లను తినడం వల్ల కిడ్నీలకు ఎంతగానో మేలు జరుగుతుంది. వీటిల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే కిడ్నీల్లో ఉండే టాక్సిన్లు బయటకు పోతాయి. ఈ పండ్లలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీల్లో ఉండే కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. రోజూ ఒక కప్పు మోతాదులో పుచ్చకాయ ముక్కలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇలా ఈ పండ్లను రోజూ కనీసం రెండింటిని అయినా తింటుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవచ్చు.