Nuts | బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్. ఇలా మనకు తినేందుకు అనేక రకాల నట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ధర ఎక్కువ ఉంటుందని, లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల ఈ గింజలను చాలా మంది తినడం లేదు. కానీ వాస్తవానికి ఈ గింజలను తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిన్నింటినీ కలిపి రోజుకు గుప్పెడు మోతాదులో రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం తినాలి. ఇలా ఈ గింజలను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, పల్లీలు వంటి గింజల్లో ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
చేపలను తినడం వల్ల లభించే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఈ గింజల్లోనూ ఉంటాయి. అందువల్ల చేపలను తినలేని వారికి ఈ గింజలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఈ గింజల్లో కొలెస్ట్రాల్ ఉండదు. కానీ వీటిల్లో కొలెస్ట్రాల్ ఉంటుందని, అది గుండెకు హాని చేస్తుందని అనుకుంటారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ నట్స్‌ను మోతాదులో తింటేనే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దేన్నీ అతిగా తినరాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) తగ్గుతుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
నట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. నట్స్‌లో ఉండే పీచు బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. ఈ నట్స్‌ను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. నట్స్‌ను తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఉండే ఫైబర్ గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది.
నట్స్‌లో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త నాళాల్లో కొవ్వు చేరకుండా చూస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాదు. పక్షవాతం వంటి జబ్బులు రాకుండా నివారిస్తుంది. నట్స్‌లో వృక్ష సంబంధ స్టెరాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గేందుకు దోహదం చేస్తాయి. గింజల్లో ఉండే ఎల్-ఆర్గినైన్ అనే సమ్మేళనం రక్త నాళాలను సాగేలా చేస్తుంది. దీంతో రక్త నాళాలు గట్టి పడకుండా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా పలు నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే అన్ని నట్స్‌ను తినకపోతే ఏదైనా ఒక రకానికి చెందిన నట్స్‌ను అయినా రోజూ గుప్పెడు మోతాదులో తినే ప్రయత్నం చేయాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.