Belly Fat | అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు ఎక్కువగా ఉన్నవారు దాన్ని కరిగించుకోవడం కోసం నానా తిప్పలు పడుతుంటారు. చాలా మందికి శరీరం సన్నగానే ఉంటుంది. కానీ పొట్ట లావుగా ఉంటుంది. దీంతో బానపొట్టను తగ్గించుకునేందుకు నానా యాతన పడుతుంటారు. అయితే కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వును చాలా సులభంగా కరిగించుకోవచ్చు. ఈ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే మనకు ఎంతగానో మేలు జరుగుతుంది. అధిక బరువు తగ్గడంతోపాటు పొట్ట దగ్గరి కొవ్వు కూడా సులభంగా కరిగిపోతుంది. ఇక ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదన్నది అక్షరాలా సత్యం అనే చెప్పవచ్చు. ఎందుకంటే యాపిల్ పండ్లను తింటే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా సులభంగా కరిగిపోతుంది. యాపిల్ పండ్లలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. అలాగే ఈ పండ్లలో ఉండే పెక్టిన్ అనే సమ్మేళనం వల్ల మనం తిన్న ఆహారం చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో అంత త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా ఆకలి నియంత్రణలో ఉండి మనం ఆహారం తక్కువగా తింటాం. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయిన వారు యాపిల్ పండ్లను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. బరువు సులభంగా తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
నారింజ పండ్లలోనూ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. నారింజ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీని వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. ఆకలిని నియంత్రించవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
బొప్పాయి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ఈ పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.
పుచ్చకాయలు ఒకప్పుడు కేవలం వేసవిలోనే లభించేవి. కానీ ఇప్పుడు సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ లభిస్తున్నాయి. పుచ్చకాయల్లోనూ క్యాలరీలు తక్కువగా, పోషకాలు అధికంగా ఉంటాయి. పుచ్చకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే మన శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. ఇలా పలు రకాల పండ్లను తినడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వును మనం సులభంగా కరిగించుకోవచ్చు. కనుక ఈ పండ్లను తినడం మరిచిపోకండి.