Platelets | వర్షాకాలం నేపథ్యంలో చాలా మంది దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతోపాటు దోమల వల్ల వచ్చే డెంగీ, మలేరియా వంటి జ్వరాలతోనూ బాధపడుతుంటారు. ఈ క్రమంలో సాధారణ దగ్గు, జలుబు అయితే కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కానీ విష జ్వరాలు వస్తే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. దీంతో జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అంతేకాకుండా జ్వరం కారణంగా శరీరంలో తగ్గిన ప్లేట్లెట్లు మళ్లీ ఉత్పత్తి అవుతాయి. దీంతో త్వరగా రికవరీ అవుతారు. తిరిగి ఉత్సాహంగా పనిచేస్తారు. సాధారణంగా డెంగీ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఇతర విష జ్వరాలు వచ్చినప్పుడు కూడా ప్లేట్లెట్లు పడిపోతాయి. రక్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి క్షీణిస్తుంది. దీంతో ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఈ దశలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక జ్వరం వచ్చినప్పుడు 2 రోజుల్లోగా తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా కలిస్తే ఇంకా మంచిది.
డెంగీ మాత్రమే కాకుండా విష జ్వరాలు ఏవి వచ్చినా సరే వారికి బొప్పాయి పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అలాగే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణమై అందులో ఉండే పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. దానిమ్మ పండ్లను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ పండ్లలోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ప్లేట్లెట్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇన్ఫెక్షన్లను తగ్గేలా చేస్తాయి. దీంతో జ్వరం నుంచి కోలుకుంటారు. అలాగే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలతోపాటు కూరగాయలను కూడా తింటుండాలి. వీటిల్లోని విటమిన్ కె ప్లేట్లెట్లు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రోగం నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.
ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారు ఉదయం పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినవచ్చు. లేదా 1 టీస్పూన్ వెల్లుల్లి రసం తాగవచ్చు. దీంతోనూ ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. బీట్రూట్ జ్యూస్ కూడా ఇందుకు అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం ఒక కప్పు బీట్ రూట్ ముక్కలను తినాలి. లేదా బీట్ రూట్ జ్యూస్ తాగాలి. ఇది ప్లేట్లెట్లను తయారు చేయడమే కాదు, రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. రోజూ ఒక క్యారెట్‌ను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే కంటి చూపు సైతం మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
కిస్మిస్లను రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటుండాలి. వీటిల్లో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తం వృద్ధి చెందేలా చేస్తాయి. ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతాయి. దీంతో జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఉత్సాహంగా కూడా మారుతారు. శరీరానికి శక్తి లభిస్తుంది. డ్రై యాప్రికాట్ పండ్లను రోజుకు 2 సార్లు తింటుండాలి. ఇవి కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను తగ్గేలా చేస్తాయి. ప్లేట్లెట్లు పెరిగేలా చేస్తాయి. ఖర్జూరాలను రోజుకు 3 చొప్పున తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటిని తింటుంటే జీర్ణ సమస్యలు సైతం తగ్గిపోతాయి. ప్లేట్లెట్లను పెంచడంలో, రక్తం పెరిగేలా చేయడంలో కివి పండ్లు కూడా మేలు చేస్తాయి. నారింజ పండ్లను తింటున్నా, వాటి జ్యూస్‌ను తాగుతున్నా మేలు జరుగుతుంది. ప్లేట్లెట్లు పెరుగుతాయి. ఇలా ఈ ఆహారాలను తీసుకుంటే ప్లేట్లెట్లను పెంచుకోవడంతోపాటు డెంగీ వంటి జ్వరాల నుంచి త్వరగా కోలుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు.