Foods For Weight Loss | అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ బరువు తగ్గలేకపోతుంటారు. బరువు తగ్గడం కోసం డైట్ పాటించడం, యోగా లేదా వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే కొందరు ఎంత చేసినా బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. కానీ అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే పలు ఆహారాలను తరచూ తింటుంటే దాంతో బరువు తగ్గడం తేలికవుతుంది. ఈ ఆహారాలు మీ శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. ఇక అధిక బరువును తగ్గించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట నీటిలో ఖర్జూరాలను నానబెట్టాలి. గుప్పెడు మోతాదులో తీసుకుని నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి. ఇలా ఖర్జూరాలను ఉదయమే తింటుంటే శక్తి లభించడమే కాదు మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చయి బరువు తగ్గుతారు. ఉదయం ఖర్జూరాలను తినడం వల్ల బరువు తగ్గవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి కనుక చలికాలం తింటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.
అధిక బరువును తగ్గించడంలో బాదంపప్పు, వాల్ నట్స్ కూడా ఎంతో మేలు చేస్తాయి. బాదంపప్పు, వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతాయి. శరీర మెటబాలిజంను పెంచి అధిక బరువును తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. కనుక బాదం పప్పు లేదా వాల్ నట్స్‌ను గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రి పూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. ఇలా రోజూ తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
ఈ సీజన్లో మనకు చిలగడదుంపలు కూడా అధికంగానే లభిస్తాయి. ఇతర దుంపలకు ఇది పూర్తిగా భిన్నమైందని చెప్పవచ్చు. ఇతర దుంపలు బరువును పెంచుతాయి. కానీ చిలగడదుంపలు బరువును తగ్గిస్తాయి. ఎందుకంటే ఈ దుంపల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయం చేస్తుంది. అలాగే అటుకులతో చేసిన ఆహారం తింటున్నా కూడా బరువు తగ్గవచ్చు. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ బరువును తగ్గించేందుకు సహాయం చేస్తుంది. నిమ్మజాతికి చెందిన పండ్లను తినడం వల్ల కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇలా పలు రకాల ఆహారాలను ఈ సీజన్లో తీసుకుంటే బరువును తగ్గించుకోవడం ఎంత మాత్రం కష్టం కాదు. చాలా సులభంగానే కొవ్వును కరిగించుకోవచ్చు.