Weight Loss | అధిక బరువును మీరు తగ్గించుకోవాలని చూస్తున్నారా. అయితే కొన్ని రకాల ఆహారాలను మీరు మీ డైట్లో భాగం చేసుకోండి. దీంతో బరువు సులభంగా తగ్గుతారు. ఈ ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల వచ్చే భారీ మార్పును మీరే గమనిస్తారు. ఈ ఆహారాలు కేవలం బరువును తగ్గించడమే కాదు, మీకు పోషణను కూడా అందిస్తాయి. మెటబాలిజాన్ని పెంచుతాయి. ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. ఇక అధిక బరువును తగ్గించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుకూరలను ఆహారంలో రోజూ తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. ముఖ్యంగా పాలకూర, బ్రోకలీ, కొత్తిమీర, పుదీనా వంటి వాటిని తినడం వల్ల ఎంతగానో మేలు జరుగుతుంది. వీటిల్లో క్యాలరీలు చాలా స్వల్పంగా ఉంటాయి. అలాగే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల వీటిని మీరు తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. ఆకుకూరల ద్వారా విటమిన్లు, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇవి శరీరానికి పోషణను, శక్తిని అందిస్తాయి. దీంతోపాటు బరువును అదుపులో ఉంచుతాయి.
అధిక బరువును తగ్గించడంలో ఓట్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. అందువల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆకలి నియంత్రణలో ఉండి ఆహారం తక్కువగా తింటారు. దీంతో శరీరంలో క్యాలరీలు తక్కువగా చేరుతాయి. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. ఓట్స్ ను మీరు బ్రేక్ ఫాస్ట్‌లో తింటే మంచిది. దీని వల్ల షుగర్ లెవల్స్‌ను కూడా తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పు దినుసులను తరచూ ఆహారంలో భాగం చేసుకున్నా కూడా అధిక బరువు తగ్గుతారు. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో ఆహారం తినాలనే యావ తగ్గిపోతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. అలాగే పప్పు దినుసులను తినడం వల్ల శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. దీంతో శరీరానికి పోషణ అందుతుంది.
పెరుగు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కండరాలు నిర్మాణమవుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. పెరుగు ప్రొబయోటిక్ ఆహారం కనుక జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది. అయితే కొవ్వు తీసిన పాలతో తయారు చేసిన పెరుగును తినాల్సి ఉంటుంది. చియా విత్తనాలు కూడా అధిక బరువును వేగంగా తగ్గించగలవు. వీటిల్లో ఫైబర్, ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. చియా విత్తనాలను మీరు స్మూతీలు లేదా సలాడ్స్‌లో తినవచ్చు. ఇలా పలు ఆహారాలను మీరు మీ డైట్లో భాగం చేసకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు.